Ravi Prakash: 24 x 7 ఉచిత వైద్యం.. సేవే లక్ష్యంగా 'రవిప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్' కృష్ణా జిల్లా కూచిపూడిలోని 'రవిప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్' పేద ప్రజల సేవే లక్ష్యంగా ప్రారంభమై ఆరేళ్లు కావొస్తోంది. దేశంలోనే హై టెక్నాలజీ x ray ల్యాబ్ తో పేదలకు 24 గంటలపాటు ఉచిత వైద్యం అందిస్తున్నారు. భోజన సదుపాయం కల్పిస్తుండటం ఈ ఆస్పత్రికి ఉన్న మరో విశిష్టత. By Jyoshna Sappogula 30 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి Ravi Prakash SiliconAndhra Sanjivani Hospital: ఇటీవలి కాలంలో జర్నలిస్టులు పొలిటికల్ ప్రముఖులుగా మారడం చూస్తున్నాం. రాజకీయ నాయకుల అడుగులకి మడుగులొత్తుతూ లాభపడుతున్న వాళ్లని చూస్తున్నాం. కానీ సేవా రంగంలో కనిపించే జర్నలిస్టులు, సేవే లక్ష్యంగా పనిచేసే మీడియా ప్రముఖులు మాత్రం అరుదైపోయారు. అయితే అందరూ వేరు, రవిప్రకాష్ వేరు. కృష్ణా జిల్లా, కూచిపూడిలో (Kuchipudi) ఉన్న రవిప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ చూస్తే ఈ మాటలు ఎంత అక్షర సత్యాలో తెలుస్తుంది. సేవే లక్ష్యంగా.. పేద ప్రజల సేవే లక్ష్యంగా ఈ హాస్పిటల్ ప్రారంభమై ఆరేళ్లు కావొస్తోంది. రవిప్రకాష్ టీవీ9 సీఈవోగా పనిచేస్తున్న సందర్భంలో ఈ ఆస్పత్రి కోసం తీవ్రంగా కష్టపడ్డారు. హాస్పిటల్ నిధుల కోసం స్వయంగా రంగంలోకి దిగారు. 2 రోజులు పాటు నిర్విరామంగా ఎలాంటి యాడ్స్ లేకుండా సంజీవిని ఆస్పత్రి కోసం నిధుల సేకరణ కార్యక్రమం చేపట్టారు. చివరికి ఆయన కలల ప్రతిరూపంగా.. 2018, దసరా రోజు పురుడు పోసుకున్న రవిప్రకాష్ సిలికానాంధ్ర సంజీవని నేడు ఎంతోమందికి ప్రాణం పోస్తోంది. హై టెక్నాలజీ.. రోజుకి 300 మంది OP పేషెంట్స్‌తో నడిస్తుంది. అత్యాధునిక టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్స్, దేశంలోనే మొట్ట మొదటి హై టెక్నాలజీ x ray ల్యాబ్ తో పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్నారు. కూచిపూడి పరిసర ప్రాంతాల్లోని 50 గ్రామాల ప్రజలు ఈ హాస్పిటల్‌లో వైద్య సదుపాయం పొందుతున్నారు. హాస్పిటల్‌కి వచ్చే రోగులతోపాటు వారి తరఫున వచ్చే అటెండర్‌కు కూడా భోజన సదుపాయం కల్పిస్తుండటం ఈ ఆస్పత్రికి ఉన్న మరో విశిష్టత. Also Read: ఆర్టీవీపై పనికిమాలిన ఫేక్ ప్రచారాలు.. ఈ అసత్యాల వెనుక ఉన్న చెంచాగాళ్లు ఎవరంటే? నాణ్యమైన వైద్యసదుపాయం.. కూచిపూడి అనగానే తెలుగువారి కళారూపం కూచిపూడి నాట్యం అందరికీ గుర్తొస్తుంది. అంత విశిష్టత ఉన్న ఊరు, దాని పరిసర ప్రాంతాల్లో పేదరికం చాలా ఎక్కువ. ఏ రోగం వచ్చిన చూపించుకోవడానికి దగ్గరలో సరైన ఆస్పత్రి కూడా లేని దుస్తితి. మెరుగైన వైద్యం కావాలంటే విజయవాడ, మచిలీపట్నం వెళ్లాల్సి వచ్చేది. ఇవన్నీ చూసి చలించిపోయిన రవిప్రకాష్, అక్కడి ప్రజలకు ఎలాగైనా నాణ్యమైన వైద్యసదుపాయం అందించాలన్న లక్ష్యంతో సంజీవని ఆస్పత్రికి శ్రీకారం చుట్టారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా.. అయితే ఆస్పత్రి నిర్మించాక, మీడియా రంగంలో రవిప్రకాష్‌ని మళ్లీ కనిపించకుండా చేయాలని ఎంతోమంది ప్రయత్నించారు. ఆ దశలో కూడా ఆయన ఎన్ని ఇబ్బందులు పడినా ఆస్పత్రి డెవలప్‌మెంట్ ఎక్కడా ఆగలేదు. రవిప్రకాష్ సిలికానాంధ్ర సంజీవనిలో ప్రైవేట్ ఆస్పత్రుల్ని మించిన సదుపాయాలు ఉన్నాయి. ప్రతి వార్డులో పేషెంట్ కోసం అత్యంత ఖరీదైన బెడ్స్ ఏర్పాటు చేశారు. మొత్తం ఐదు అంతస్తులుగా నిర్మాణం జరిగిన ఈ హాస్పిటల్‌లో ప్రస్తుతం రెండు ఫ్లోర్‌లలోనే పనిచేస్తుంది. 24 x7.. మూడు నాలుగు అంతస్తుల్లో నిర్మాణాలు పూర్తి చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు రవిప్రకాష్. ప్రస్తుతం కృష్ణాజిల్లాలో ఎక్కడా లేని విధంగా 5 అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు నిర్మాణ దశలో ఉన్నాయి. ప్రస్తుతం ఆర్థోపెడిక్, న్యూరో, పీడియాట్రిక్, డెంటల్, గైనకాలజీ విభాగాల్లో నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉన్నారు. పేదలకు 24 గంటలపాటు వైద్య సదుపాయాలు అందిస్తున్నారు. #ravi-prakash-siliconandhra-sanjivani-hospital మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి