Crime News: మాదాపూర్‌లో రేవ్‌ పార్టీ కలకలం.. 20 మంది అరెస్ట్..!

హైదరాబాద్‌ మాదాపూర్‌లో రేవ్‌ పార్టీ కలకలం రేపుతోంది. సైబర్‌ టవర్స్ సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో రేవ్ పార్టీ నిర్వహించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు 14 మంది యువకులు, ఆరుగురు యువతులను అరెస్ట్ చేశారు. పెద్ద ఎత్తున డ్రగ్స్‌, రూ. లక్షా 25 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.

New Update
Crime News: మాదాపూర్‌లో రేవ్‌ పార్టీ కలకలం.. 20 మంది అరెస్ట్..!

Hyderabad Rave Party: హైదరాబాద్‌ మాదాపూర్‌లో రేవ్‌ పార్టీ కలకలం రేపుతోంది. సైబర్‌ టవర్స్ సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో రేవ్ పార్టీ నిర్వహించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు 14 మంది యువకులు, ఆరుగురు యువతులను అరెస్ట్ చేశారు. బర్త్‌ డే సందర్భంగా నిర్వహకుడు నాగరాజుయాదవ్ రేవ్‌ పార్టీ నిర్వహించారు.

ఫారిన్ లిక్కర్‌తో పాటు భారీగా కొకైన్, MDMA, OG కుష్‌ డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు. మిగిత ఐదుగురికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి విడుదల చేశారు. మొత్తం రూ.లక్షా 25 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇన్నోవా క్రిస్టా వెహికిల్ ను కూడా సీజ్‌ చేశారు. గోవా నుంచి డ్రగ్స్‌ తీసుకువచ్చినట్లు అధికారులు గుర్తించారు.

Advertisment
తాజా కథనాలు