రతన్ టాటా ఉన్నత విలువలు,ఉదారత ఉన్న గొప్ప భారీతీయ వ్యాపార వేత్త. వ్యాపారాన్ని ఆర్థిక మార్గంగా కాకుండా, సేవా మార్గంగా చూసే మహోన్నత వ్యక్తి. భారత దేశ పారిశ్రామిక రంగానికి వెన్నుదన్నుగా నిలిచిన అరుదైన వ్యాపారవేత్తల్లో రతన్ టాటా ముందువరుసలో నిలుస్తారు.అందుకే ఆయనను ఎన్నో అవార్డులు,అత్యూన్నత పురస్కారాన్నీ వరించాయి. తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం ‘ఉద్యోగ రత్న’అవార్డుతో రతన్ టాటాను గౌరవించనుంది. మహారాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి ఉదయ్ సామంత్ ఓ ప్రకటనలో తెలియజేశారు.
వ్యాపార రంగంలో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులకు మహారాష్ట్ర ప్రభుత్వం అందజేసే అత్యున్నత రాష్ట్ర పురస్కారం ‘మహారాష్ట్ర ఉద్యోగ రత్న’. ఈ ఏడాది నుంచే ఉద్యోగ రత్న అవార్డు ప్రదానం చేయాలని మహారాష్ట్ర సర్కార్ నిర్ణయించింది.
ఈ మేరకు సీఎం ఏక్ నాథ్ షిండే, డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్, పరిశ్రమలశాఖ మంత్రి ఉదయ్ సామంత్‌లతో కూడిన మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది.
వ్యాపారం, పరిశ్రమ, విద్య, రియల్ ఎస్టేట్, పర్యాటకం, ఆర్థిక సేవలు, ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్, వ్యవసాయం, బ్యాంకింగ్, ఐటి, ఫుడ్స్, హెల్త్ కేర్ తదితర రంగాల్లో విశిష్ట సేవలందించిన పారిశ్రామికవేత్తలకు ఈ అవార్డులు ప్రదానం చేయనున్నది.
యువ పారిశ్రామికవేత్తలు, మహిళా పారిశ్రామికవేత్తలు, మరాఠీ పారిశ్రామికవేత్తలకు కూడా ఈ అవార్డులు ప్రదానం చేయాలని నిర్ణయించారు. రతన్ టాటా ఆధ్వర్యంలో ఎదిగిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)...ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా పని చేసింది,చేస్తూనే ఉంది.
ప్రస్తుతం గ్లోబల్ ఐటీ జెయింట్ సంస్థల్లో ఒకటి టీసీఎస్.ఎంతో మంది దిగ్గజ సాఫ్ట్వేర్ ఇంజినీర్లను ప్రపంచానికి పరిచయం చేసింది. రతన్ టాటా హయాంలోనే న్యూయార్క్ స్టాక్ ఎక్చ్సేంజ్‌లో టాటా మోటార్స్ అత్యున్నత స్థానాన్ని సంపాదించిది.
టాటా సన్స్ చైర్మన్‌గా.. రతన్ టాటా సేవలందించిన 21 ఏండ్ల పాటు టాటాసంస్థ ఆదాయం 40 రెట్లకు పైగా పెరింగింది. తన నేతృత్వంలో ధాతృత్వాన్ని కొనసాగిస్తూనే 50 రెట్లకు పైగా లాభాలు గడించింది.
సేవారంగంలో స్నేహపూర్వక వాతావరణాన్ని నింపి భారతదేశ స్థానాన్ని అభివృద్ధిపథంలో నడిపించినందుకు గాను 2000లో కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మభూషణ్, 2008లో దేశ అత్యున్నత పౌరపురస్కారమైన పద్మ విభూషణ్ తో గౌరవించింది.