Rashi Khanna: టాలీవుడ్ బ్యూటీ రాశీ కన్నా గురించి పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ ఫిలిం మద్రాస్ కేఫ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రాశీ.. ఇటు తెలుగు అటు హిందీ సినిమాలు చేస్తూ ఫుల్ క్రేజ్ దక్కించుకుంది. లాస్ట్ ఇయర్ ఫర్జీ వెబ్ సీరీస్ తో సూపర్ హిట్ కొట్టిన రాశీ ప్రస్తుతం ‘ది సబర్మతి రిపోర్ట్’, ‘యోధ’, ‘TME’, ‘తెలుసు కదా’ సినిమాల చిత్రీకరణతో బిజీగా ఉంది. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన ఫర్జీ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఫర్జీ సీరీస్ తో హిందీతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది రాశీ. సినిమాలు, వెబ్ సీరీస్ తో బిజీగా ఉన్న రాశీ.. తాజాగా సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో ముచ్చటించింది. Q&A లో భాగంగా ఆసక్తికర విషయాలు పంచుకుంది.
నాకు సంతోషాన్ని ఇచ్చేవి ఈ మూడే
తనకు ఎక్కువ సంతోషాన్ని కలిగించేవి ఏంటి అని అభిమానులు అడిగిన ప్రశ్నకు.. రాశీ ఆసక్తికరమైన విషయాలు చెప్పింది. ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేయడం, పుస్తకాలు చదవడం, భిన్నమైన కథలతో కూడిన సినిమా షూటింగ్స్ లో పాల్గొనడం, పుస్తకాలు బాగా చదవడం.. నన్ను ఎక్కువగా సంతోష పెట్టే విషయాలని తెలిపింది. అలాగే తనకు ఇష్టమైన కొన్ని పుస్తకాల పేర్లను కూడా పంచుకుంది. ‘మిడ్నైట్ లైబ్రెరి’, ‘ది ఫౌంటెన్ హెడ్’, ‘112 వే టూ మెడిటేట్’ బుక్స్ ఇస్తామని చెప్పింది.
Also Read: Chiranjeevi: పద్మ శ్రీ పురస్కార గ్రహితలను సత్కరించిన .. మెగాస్టార్ చిరంజీవి
ఆ డైరెక్టర్స్ తో వర్క్ చేయాలని ఉంది
విజయ్ , మహేష్ బాబు, షారుక్ ఖాన్, హృతిక్ రోషన్, అల్లు అర్జున్ హీరోలతో కలిసి నటించాలని ఉంది. సంజయ్ లీలా భన్సాలీ, జోయా అక్తర్, రాజ్‌కుమార్ హిరాణీ, మణిరత్నం, విధు వినోద్ చోప్రా, అనురాగ్ కష్యప్, త్రివిక్రమ్, సుకుమార్ వంటి ప్రముఖ దర్శకుల చిత్రాలు విభిన్నంగా ఉంటాయని.. వారి డైరెక్షన్ లో సినిమా చేయాలనేది నా కల అని తెలిపింది. అయితే రాశీ మరో ఇంట్రస్టింగ్ విషయాన్నీ కూడా చెప్పింది. ఆమె నటించిన సూపర్ హిట్ ఫిల్మ్ ‘సుప్రీమ్’కి సీక్వెల్ వస్తే బాగుంటుందని.. అది తన అభిప్రాయమని చెప్పింది.
Also Read: Jai Hanuman: హనుమాన్, రాముడిగా ఇద్దరు స్టార్ హీరోలు.. ఎవరో చెప్పేసిన ప్రశాంత్ వర్మ