RapidX Rail Servicie: రాపిడ్ ఎక్స్ రైల్‌ను జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ..

భారతదేశ మొట్టమొదటి 'ప్రాంతీయ వేగవంతమైన రవాణా వ్యవస్థ' (RRTS)ని ఢిల్లీ-మీరట్ కారిడార్‌ను జాతికి అంకితం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. శుక్రవారం ర్యాపిడ్ ఎక్స్ ట్రైన్ ను జెండా ఊపి ప్రారంభించారు ప్రధాని. ఈ ట్రైన్ సర్వీస్ అందుబాటులోకి రావడంతో.. ఢిల్లీ-మీరట్ ప్రయాణ సమయం చాలా వరకు తగ్గింది. 82.5 కిలోమీటర్ల పొడవైన ఢిల్లీ-మీరట్ RRTS కారిడార్‌లో.. మొదటిదశగా 17 కిలోమీటర్ల కారిడార్ పూర్తి చేశారు.

New Update
RapidX Rail Servicie: రాపిడ్ ఎక్స్ రైల్‌ను జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ..

Namo Bharat RapidX Train: దేశంలోనే తొలి రీజినల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) కారిడార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రారంభించారు. సాహిబాబాద్ – దుహై డిపో స్టేషన్ల మధ్య ర్యాపిడ్ ఎక్స్ 'నమో భారత్' (Namo Bharat RapidX Train) రైలు సర్వీసులకు పచ్చజెండా ఊపి జాతికి అంకితం చేశారు. ఆ తర్వాత నమో భారత్ రైలులో జర్నీ చేశారు. సాహిబాబాద్ నుంచి గుల్దర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్రయాణించారు ప్రధాని. ప్రయాణంలో భాగంగా రైలు సిబ్బంది, స్కూలు విద్యార్థులతో సరదాగా ముచ్చటించారు.

ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ కారిడార్‌ భారతదేశ మొట్టమొదటి 'ప్రాంతీయ వేగవంతమైన రవాణా వ్యవస్థ' (RRTS). 82.5 కిలోమీటర్ల పొడవైన ఢిల్లీ-మీరట్ RRTS కారిడార్‌లో.. మొదటిదశగా 17 కిలోమీటర్ల కారిడార్ పూర్తి చేశారు. దీనిని శుక్రవారంన ప్రధాని ప్రారంభించారు. కాగా, ఈ ర్యాపిడ్ ఎక్స్ రైలు అందుబాటులోకి రావడంతో మీరట్ నుంచి ఢిల్లీకి ప్రయాణం మరింత సులభతరం అవుతుంది. ఇప్పటి వరకు మీరట్ నుంచి ఢిల్లీకి (Delhi) చేరుకోవాలంటే గంటల తరబడి ప్రయాణించాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ సర్వీస్ ప్రారంభించిన తర్వాత నిమిషాల్లో ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. అయితే కారిడార్ మొత్తం ఇంకా ప్రారంభం కాలేదు. ప్రస్తుతానికి కొంత మార్గాన్ని మార్గాన్ని మాత్రమే అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇక ఈ ర్యాపిడ్ ట్రైన్ ఛార్జీలు కూడా సామాన్యులకు అందుబాటు ధరలోనే ఉన్నాయి. ఈ ట్రైన్ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు నడుస్తుంది.

ర్యాపిడ్ ఎక్స్ రైలు ఏ మార్గంలో నడుస్తోంది?

ఢిల్లీ-మీరట్ RRTS కారిడార్‌లో ప్రస్తుతం ఐదు స్టేషన్లు ఉన్నాయి. వీటిలో సాహిబాబాద్, ఘజియాబాద్, గుల్ధర్, దుహై, దుహై డిపో స్టేషన్లు ఉన్నాయి. సాహిబాబాద్ నుండి దుహై డిపో స్టేషన్ వరకు దూరం 17 కిలోమీటర్లు ప్రయాణించనుంది ర్యాపిడ్ ఎక్స్ ట్రైన్. ప్రస్తుతం ఈ మార్గాల్లోనే ర్యాపిడ్ రైల్ నడుస్తోంది. సాహిబాబాద్ నుండి దుహై డిపోకు రోడ్డు మార్గంలో వెళ్లడానికి 30 నుండి 35 నిమిషాలు పడుతుంది. కానీ ఈ ప్రయాణాన్ని ర్యాపిడ్ ఎక్స్ రైలు ద్వారా కేవలం 12 నిమిషాల్లో పూర్తి చేయవచ్చు.

Also Read: ఇస్రో మరో ప్రతిష్టాత్మక ప్రయోగం.. మిషన్‌ గగన్‌యాన్‌లో తొలి ప్రయోగం

ర్యాపిడ్ ఎక్స్ ట్రైన్ ఛార్జీలు ఎంత?

రాపిడ్‌ఎక్స్‌లో (RapidX Train) స్టాండర్డ్ క్లాస్ ధర రూ. 20 నుండి ప్రారంభమవుతుంది. ప్రీమియం తరగతి ధర రూ. 40 నుండి ప్రారంభమవుతుంది. స్టాండర్డ్ క్లాస్‌లో సాహిబాబాద్ నుంచి దుహై డిపోకు వెళ్లేందుకు టిక్కెట్ ధరను రూ. 50 గా నిర్ణయించారు. ప్రీమియం క్లాస్‌లో ప్రయాణికులు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. ఇక 5 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలు టిక్కెట్ లేకుండానే ప్రయాణించవచ్చు. మెట్రోలో మాదిరిగానే ఈ టిక్కెట్లు కొనుగోలు చేయవచ్చు. స్టేషన్‌లో కౌంటర్, టికెట్ వెండింగ్ మెషిన్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది.

రైలులో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి?

ఈ ర్యాపిడ్ ఎక్స్ రైలులో సౌకర్యవంతమైన సీట్లు అమర్చారు. పెద్ద కిటికీలతో పాటు.. ప్రయాణికులు నిలబడి ప్రయాణించడానికి తగినంత స్థలం కూడా ఉంది. ప్రయాణికులకు లగేజీ స్టోరేజీ సౌకర్యం కూడా కల్పించారు. అలాగే ప్రయాణీకులు తమ ల్యాప్‌టాప్/మొబైల్‌ను కూడా ఛార్జ్ చేసుకునే అవకాశం ఉంది. మ్యాప్ ఆప్షన్ కూడా ఇచ్చారు. ఈ రైలులో ఒకేసారి 1700 మంది ప్రయాణికులు ప్రయాణించే సౌకర్యం ఉంది. ప్రీమియం కోచ్‌లో రిక్లైనింగ్ సీట్, కోట్ హుక్, మ్యాగజైన్ హోల్డర్, ఫుట్‌రెస్ట్ వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి.

రైలు వేగం ఎంత?

RapidX వేగం గంటకు 180 కిలోమీటర్లు. కానీ, ఇది గంటకు 160 కి.మీ వేగంతో మాత్రమే నడుస్తుంది. దీని లుకింగ్ కూడా బుల్లెట్ రైలు మాదిరిగా ఉంటుంది. సుదూర ప్రయణాన్ని ఈ ట్రైన్ హాయిగా మార్చేయనుంది. ఈ ట్రైన్ అందుబాటులోకి రావడంతో ప్రజలకు బస్సుల్లో ప్రయాణించే కష్టాలు కూడా తప్పినట్లు అయ్యింది. కాగా, ఈ ట్రైన్‌కు 'నమో భారత్' పేరు పెట్టినట్లు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ వెల్లడించారు.

Also Read: విశాఖలో అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం.. కారు బోల్తా.. యువకుడు స్పాట్ డెడ్..

Advertisment
తాజా కథనాలు