మతిస్థిమితం లేని ఓ యువతిపై అత్యాచారం.. 6 నెలల గర్భవతి..! మతిస్థిమితం లేని ఓ యువతిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు వైసిపి నేత కోటేష్. యువతిని అత్యాచారం చేసి ఆరు నెలల గర్భవతిని చేసిన సంఘటన అతి దారుణమన్నారు. ఘటనపై చర్యలు తీసుకోవాలని తిరువూరు ఆర్డిఓకి వినతిపత్రం అందజేశారు. By Jyoshna Sappogula 18 Nov 2023 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి Crime News: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం ముష్టికుంట్ల గ్రామంలో మతిస్థిమితం లేని ఒక దళిత యువతిపై జరిగిన అమానుష దాడిని తీవ్రంగా ఖండించారు వైసిపి నాయకుడు బరిగల కోటేష్. జరిగిన సంఘటనపై ఎంక్వయిరీ చేసి నింధితులకు శిక్ష పడేవిధంగా చర్యలు తీసుకోవాలని తిరువూరు ఆర్డిఓకి వినతిపత్రం అందజేశారు. అలాగే, బాధిత మహిళకు ప్రభుత్వం అండగా ఉండాలని, అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. ఆనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మతిస్థిమితం లేని ఒక దళిత యువతిపై జరిగిన దాడి అమానుషం అని అవేదన వ్యక్తం చేశారు. ముష్టికుంట్ల గ్రామానికి చెందిన ఆరుగురు వ్యక్తులు మతిస్థిమితం లేని మహిళని అత్యాచారం చేసి ఆరు నెలల గర్భవతిని చేసిన సంఘటన అతి దారుణమన్నారు. అయితే, అదే గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఆ దళిత మహిళ మానానికి రేటు కడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. Also read: పవర్ లేని వ్యక్తి పవన్ కళ్యాణ్..మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు.! బాధిత మహిళ ప్రాణాలకు ప్రమాదం అని తెలిసి కూడా చట్ట విరుద్ధంగా ఆరు నెలల గర్భవతికి అబార్షన్ చేసి పుట్టబోయే ఆ పసిబిడ్డ ప్రాణాలు తీశారని తెలిపారు. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని హ్యూమన్ రైట్స్, ఆర్డీవో, జెసి, సంబంధిత అధికారులను కలవడం జరిగిందని తెలిపారు. త్వరలో రాష్ట్రపతిని కలవనున్నారని వెల్లడించారు. ఈ సంఘటనలో చట్టాన్ని చేతిలోకి తీసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి కోరారు. ఇలాంటి సంఘటన ఇక్కడే కాదు రాష్ట్రంలో మరెక్కడ జరగకుండా ఉండాలంటే నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వ్యాఖ్యనించారు. #andhra-paradesh మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి