Mumbai Hording : ముంబై హోర్డింగ్‌ ప్రమాదంలో వెలుగులోకి దారుణ విషయాలు!

ముంబైలో సోమవారం భారీ హోర్డింగ్‌ కూలి 14 మంది మృతి చెందిన ఘటనలో ఇగో మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ యాడ్‌ ఏజెన్సీ యజమాని భవేశ్‌ భిండేపై కేసు నమోదు అయ్యింది. అయితే అతడి గురించి ఘోరమైన విషయాలు ప్రస్తుతం వెలుగులోకి వచ్చాయి. పూర్తి వివరాలు ఈ కథనంలో..!

New Update
Mumbai Hording : ముంబై హోర్డింగ్‌ ప్రమాదంలో వెలుగులోకి దారుణ విషయాలు!

Mumbai Hording Collapse : సోమవారం ముంబై(Mumbai) లో గాలి తుఫాన్ బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ గాలి తుఫాన్‌ బీభత్సంలో ఓ భారీ హోర్డింగ్‌ కూలి సుమారు 14 మంది మృతి చెందగా.. 76 మందికి తీవ్ర గాయాలు అయిన సంగతి తెలిసిందే. గాయపడిన వారంతా కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దారుణ ఘటన అనేక కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.

ఈ ఘటనలో ఇగో మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ యాడ్‌ ఏజెన్సీ(Ego Media Pvt. Ltd Ad Agency) యజమాని భవేశ్‌ భిండే(Bhavesh Bhinde) పై కేసు నమోదు అయ్యింది. అయితే అతడి గురించి ఘోరమైన విషయాలు ప్రస్తుతం వెలుగులోకి వచ్చాయి. అక్రమంగా హోర్డింగ్‌లు పెట్టినందుకు నిందితుడు భవేశ్‌పై 20కి పైగా జరిమానాలు పడినట్లు సమాచారం. అలాగే ఈ ఏడాది ప్రారంభంలో అతడిపై ఓ అత్యాచారం కేసు కూడా నమోదైంది.

అయితే ముందస్తు బెయిల్‌(Anticipatory Bail) పై ప్రస్తుతం అతడు బయట ఉన్నాడు. అది తప్పుడు కేసు అని అతడి తరఫు న్యాయవాదులు వెల్లడించారు. ఇక ఘాట్కోపర్‌ ప్రాంతంలో కూలిన హోర్డింగ్‌ కోసం ఎలాంటి ముందస్తు అనుమతి లేదని బృహన్‌ ముంబయి మున్సిపల్‌ అధికారులు వెల్లడించారు. ఈ హోర్డింగ్‌ అనుమతించిన గరిష్ఠ పరిమాణం కన్నా తొమ్మిది రెట్లు పెద్దదిగా ఉందని అధికారులు గుర్తించారు.

సోమవారం రాత్రి ములుంద్‌ ప్రాంతంలోని భవేశ్‌ ఇంట్లో సోదాలు నిర్వహించగా అతడి జాడ తెలియరాలేదు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.

Also read: బ్యాంకును మోసం చేసిన కేసులో డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ డైరెక్టర్‌ అరెస్ట్‌!

Advertisment
తాజా కథనాలు