Ramoji Rao-SPB: రామోజీరావుకు ఎస్పీ బాలు అంటే చాలా ఇష్టం.. స్నేహితుడి కోసం రామోజీ ఏం చేశాడంటే?

రామోజీరావు, ఎస్పీ బాలసుబ్రమణ్యంకు మధ్య మంచి స్నేహం ఉండేది. తెలుగు ప్రజలు ఎంతగానో ఇష్టపడే కార్యక్రమాల్లో ఒకటైన 'పాడుతా తీయగా' ప్రోగ్రాం కూడా వీరి స్నేహం నుంచే పుట్టింది. ఈ ప్రోగ్రాం ఈటీవీలో ఏకంగా 1100 ఎపిసోడ్లు నడిచి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది.

New Update
Ramoji Rao-SPB: రామోజీరావుకు ఎస్పీ బాలు అంటే చాలా ఇష్టం.. స్నేహితుడి కోసం రామోజీ ఏం చేశాడంటే?

Ramoji Rao - SP Balasubrahmanyam: 'వాడిపోనిది స్నేహం ఒక్కటే... వీడిపోనిది నీడ ఒక్కటే.. హాద్దంటూ లేనేలేనిది ఫ్రెండ్‌షిప్‌ ఒక్కటే..' ప్రేమదేశం సినిమాలో ఈ పాటలోని అక్షరాలను ప్రతిబింబించే మనుషులు చాలా మంది కనిపిస్తారు. మీడియా దిగ్గజం రామోజీరావు, లెజండరీ సింగర్‌ ఎస్పీ బాలసుబ్రమణ్యం స్నేహం అలాంటిదే. 2020 సెప్టెంబర్‌ 25న ఈ లోకాన్ని వీడిన ఎస్పీ బాలు నాలుగేళ్ల తర్వాత తన స్నేహితుడిని తనతో పాటే తీసుకెళ్లారు. ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ చెరుకూరి రామోజీరావు 2024 జూన్ 8 తెల్లవారుజాముల 4 గంటల 50నిమిషాలకు అస్తమించారు. దీంతో ఆయనతో సినీ లోకానికి ఉన్న సంబంధాలపై.. ప్రత్యేకించి ఎస్పీ బాలుతో ఆయనకున్న బంధాన్ని గురించి ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు!

రామోజీరావు సొంత ఛానెల్‌ ఈటీవీలో ఎస్పీ బాలుకు సంబంధించి ఎన్నో ప్రొగ్రామ్స్‌ వచ్చేవి. ఈటీవీ ప్రారంభం నుంచే బాలు పాటలు ఆ ఛానెల్‌లో వినిపించేవి. ఇలా రామోజీరావుతో బాలుకు స్ట్రాంగ్‌ బాండ్‌ ఏర్పడింది. 'ఈటీవీ' 1995 ఆగస్టు 27న ప్రారంభమైంది. రామోజీరావు బాలుతో ఒక కార్యక్రమం చేయాలని ప్లాన్ చేశారు. ప్రణాళికలను రూపొందించాలని తన టీమ్‌కు సూచించారు. తెలుగు ప్రజలు ఎంతగానో ఇష్టపడే కార్యక్రమాల్లో ఒకటైన 'పాడుతా తీయగా' ఐడియా అప్పుడే పుట్టింది. తెలుగు టెలివిజన్ చరిత్రలో గొప్ప గాన ప్రదర్శనగా ఈ కార్యక్రమం నిలిచింది.

Also Read: ఎన్టీఆర్ ని హీరోని చేసింది.. విజయశాంతిని లేడీ సూపర్ స్టార్ చేసింది రామోజీరావు సినిమాలే!

పాడుతా తీయగా కార్యక్రమాన్ని మొదటిసారిగా 1996 జనవరి 12న ప్రసారం చేశారు. దశాబ్దాలపాటు ఈ ప్రొగ్రామ్‌ తెలుగు ప్రజలను టీవీలకు అత్తుకుపోయేలా చేసంది. ఏకంగా 1,100 ఎపిసోడ్‌ల పాటు నిరంతరాయంగా కొనసాగింది. ఈ రియాలిటీ సింగింగ్ షో రామోజీ రావు దురదృష్టికి నిదర్శనంగా చెబుతారు విశ్లేషకులు. అటు ప్రతిభావంతులను వెలికితీసేందుకు SPB అంకితభావం తోడైంది. అందుకే 'పాడుతా తీయగా'లో పాల్గొన్న చాలామంది నవతరం గాయకులుగా పేరు తెచ్చుకున్నారు.

ఇక కొన్ని స్నేహాలు బంధుత్వాలుగా మారి శాశ్వతంగా ఉంటాయనడానికి ఎస్పీ బాలు- రామోజీరావు ఫ్రెండ్‌షిపే ఉదాహరణ. ఓసారి చెన్నై నుంచి హైదరాబాద్‌కు ఈటీవీ ప్రొగ్రెమ్‌లో పాల్గొనేందుకు ఎస్పీబాలు రావాల్సి ఉంది. ఎయిర్‌పోర్టులో దిగిన తర్వాత తనకు కారు పంపించాలని ఎస్పీ బాలు ఈటీవీ సిబ్బందిని కోరారు. అయితే తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ ఫ్లైట్‌ ఎక్కేముందు ఫోన్‌ చేస్తే ఎవరూ లిఫ్ట్ చేయలేదు. దీంతో బాలు డైరెక్ట్‌గా రామోజీరావుకే కాల్‌ చేశారు. మీ ట్రావెలింగ్‌ ఏర్పాట్లు నేను చూసుకుంటానని రామోజీరావు హామీ ఇచ్చారు. తర్వాతి రోజు ఉదయం బాలు ఫ్లైట్ దిగారు. వెంటనే షాక్‌ అయ్యారు. ఎందుకంటే తనను రిసీవ్‌ చేసుకోవడానికి స్వయంగా రామోజీరావే వచ్చారని బాలుకు అర్థమైంది.

కుమారుడి కారులో రామోజీరావు వచ్చి తనని ఎయిర్‌పోర్టులో రిసీవ్ చేసుకున్నారని ఎస్పీ బాలు ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. ఈటీవీ 20వ వార్షికోత్సవ వేడుకల్లో బాలు ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. తను తిరిగి వెళ్లేవరకు రామోజీరావు తనతో ఉన్నారని గుర్తుచేసుకోని ఎమోషనల్‌ అయ్యారు బాలు. ఇటు ఎస్పీ బాలు అస్తమించిన తర్వాత ఈటీవీ ఆయన కోసం ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలను చేసింది. ఇలా వీరిద్దరు భౌతికంగా మన మధ్య లేకపోయినా వారి మధ్య ఉన్న బంధం, ఈటీవీ ద్వారా వీక్షకులను అలరించిన తీరు అందరి గుండెల్లో చిరకాలం ఉంటుంది!

Advertisment
తాజా కథనాలు