Haleem Recipe: హలీమ్ చేసుకోవడం ఇంత ఈజీనా.. టేస్ట్ అదిరిపోతుంది..!

రంజాన్ సీజన్ అనగానే మొదటగా గుర్తొచ్చేది హలీమ్. ఇది తినడానికి అద్భుతంగా ఉంటుంది కానీ తయారు చేయడమే చాలా కష్టమైన పని. అందుకే బయటే ఎక్కువగా కొంటుంటారు. అయితే సింపుల్ గా ఇంట్లోనే హలీమ్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. పూర్తి రెసిపీ కోసం హెడ్డింగ్ పై క్లిక్ చేయండి.

New Update
Haleem Recipe: హలీమ్ చేసుకోవడం ఇంత ఈజీనా.. టేస్ట్ అదిరిపోతుంది..!

Haleem Recipe: రంజాన్ సీజన్ అనగానే మొదటగా గుర్తొచ్చేది హలీమ్. ఇది తినడానికి అద్భుతంగా ఉంటుంది కానీ తయారు చేయడమే చాలా కష్టమైన పని. అందుకే బయటే ఎక్కువగా కొంటుంటారు. అయితే సింపుల్ గా ఇంట్లోనే హలీమ్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. 

హలీమ్ కోసం కావాల్సిన పదార్థాలు

మటన్ కీమా - 500 గ్రా, అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్ , జీడిపప్పు - 50 గ్రా, మినప్పప్పు - 1 టేబుల్ స్పూన్ , పెరుగు - 120 గ్రా , పాలు - 1/2 కప్పు, మిరియాలు - 1 టేబుల్ స్పూన్, నెయ్యి - 60 గ్రా, కొత్తిమీర ఆకులు, పుదీనా - 5 గ్రా, పేసరపప్పు - 1 టేబుల్ స్పూన్, గోధుమ రవ్వ - 90 గ్రా

చనా పప్పు - 1 టేబుల్ స్పూన్, ఎర్ర పప్పు -1 టేబుల్ స్పూన్, పసుపు పొడి - 1/4 టేబుల్ స్పూన్, గరం మసాలా పొడి - 1 టేబుల్ స్పూన్, కారం - 1 టేబుల్ స్పూన్ , దాల్చిన చెక్క - 2 కర్రలు, పచ్చిమిర్చి - 2 , ఉప్పు - రుచికి సరిపడ, నూనె - తగినంత, నీరు - అవసరమైన విధంగా, వేయించిన ఉల్లిపాయలు, 2 నిమ్మకాయ ముక్కలు

హలీమ్ తయారీ విధానం

step 1: ముందుగా అన్ని రకాల పప్పులను గంట లేదా రెండు గంటల పాటు నానబెట్టండి.

step 2: నానబెట్టిన పప్పులను నీళ్లతో సహా కుక్కర్ లో వేసుకోని, అందులోకి 2 పచ్చిమిర్చీలు, 1/4 పసుపు, ఉప్పు(తగినంత), 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని బాగా కలిపి.. ఒక 5 నుంచి 8 whistles వచ్చేంత వరకు ఉడకపెట్టండి.

step3: ఉడకపెట్టిన పదార్ధాన్ని తీసుకొని పప్పు గుత్తెతో బాగా మెత్తగా చేసుకోవాలి లేదా మిక్స్ లో కూడా వేసుకోవొచ్చు.

Step 4: ఇప్పుడు వేరే కడాయి తీసుకొని 4 నుంచి 5 టేబుల్ స్పూన్ ఆయిల్ లేదా నెయ్యి వేసుకొని అందులోకి 2 తరిగిన ఉల్లిపాయలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్  వచ్చేవరకు వేయించాలి. ఆ తర్వాత వేయించిన ఉల్లిపాయలు ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి.

Step 5: ఇప్పుడు అదే నూనెలో అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు మటన్ వేసి, పచ్చి రుచి పోయే వరకు 3 నిమిషాలు ఎక్కువ మంట మీద వేయించాలి.

Step 6: తర్వాత మిగిలిన మసాలాలు, పుదీనా ఆకులను జోడించండి. పచ్చి కొత్తిమీర ,పెరుగు వేసి మరో 2 నిమిషాలు ఉడికించాలి. తర్వాత కొన్ని నీళ్ళు పోసి కుక్కర్ మూత పెట్టేసి..  మీడియం మంట పై 10-15 విజిల్స్ వచ్చేలా ఉడికించాలి.

Step 7: ఉడికించిన మటన్ ని గరిటెతో మెత్తని పేస్ట్‌లా  చేయాలి.

publive-image

Step 8: వేరే పాత్రను తీసుకొని 2 లేదా 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోని అందులో ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, ఉడికించిన మెత్తని మటన్, పేస్ట్ చేసిన పప్పులను వేసి.. బాగా కలుపుకొని దాంట్లో  2 కప్పుల నీరు పోసి 30 నిమిషాల వరకు ఉడికించుకోవాలి.

Step 9: 30 నిమిషాల తర్వాత వేడి చేసి ఉంచుకున్న పాలు, నెయ్యి వేసి మీడియం మంట పై  మరో 15 నిమిషాలు ఉంచాలి.

step 10: ఆ తర్వాత అందులోకి వేయించిన ఉల్లిపాయలు, జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ కస్తూరి మెంతి వేసి బాగా కలపాలి.

step 11: వడ్డించేటప్పుడు, హలీమ్ వేసి దాని పై  కొంచెం నెయ్యి, వేయించిన జీడిపప్పు, ఉల్లిపాయలు, నిమ్మకాయ మరియు ఉడికించిన గుడ్డు వేసి ఆపై సర్వ్ చేయాలి. అంతే అదిరిపోయే హలీమ్ రెడీ.

Also Read: Pushpa 2 Teaser: అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్.. పుష్ప-2 టీజర్ రిలీజ్ ఆ రోజే ..!

Advertisment
తాజా కథనాలు