Ram Navami 2024: అయోధ్యలో బాల రాముడికి సూర్యతిలకం-LIVE

శ్రీరామనవమి వేళ అయోధ్యలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు బాలరాముడి నుదిటపై భక్తులకు కనువిందు చేసింది. 3 నిమిషాల పాటు కనిపించిన ఈ సూర్యతిలకాన్ని తిలకించి భక్తులు పరవశించారు.

New Update
Ram Navami 2024: అయోధ్యలో బాల రాముడికి సూర్యతిలకం-LIVE

అయోధ్యలో అద్భుత దృశ్యం భక్తులకు కనువిందు చేసింది. బాలరాముడి నుదుటిపై సూర్యకిరణాలు ప్రసరించాయి. మూడున్నర నిమిషాల పాటు ఈ అద్భుతం కొనసాగింది. 58 మిల్లీమీటర్ల పరిమాణంలో సూర్యకిరణాలు బాలరాముడిపై ప్రసరించాయి. ప్రతీ సంవత్సరం శ్రీరామనవమి నాడు ఈ అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. భక్తులు సూర్యతిలకాన్ని వీక్షించేలా ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయ మూడో అంతస్తు నుంచి గర్భగుడిలోకి అద్దాలు, కటకాలతో తదితర పరికారాలతో ఆయోధ్య రాముడిపై ‘సూర్య’తిలకం పడేలా ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు.

19 ఏళ్లపాటు..
ఈ సూర్యతిలకం మొత్తం 19 ఏళ్లపాటు ప్రతీ శ్రీరామనవమి నాడు బాల రాముడి విగ్రహంపై ఏర్పడనుంది. బాలరాముడికి సూర్య తిలకం కోసం అధికారులు, శాస్త్ర వేత్తలు తీవ్రంగా శ్రమించారు. ఇందుకోసం.. ఆలయ మూడో అంతస్తులో ప్రత్యేకమైన అద్దాలను అమర్చారు అధికారులు. సూర్య కిరణాలు ఆ అద్దంపై పడి.. అక్కడి నుంచి రెండో అంతస్తులోకి, ఆ తర్వాత గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న గర్భగుడిలోని బాలరాముడి విగ్రహం నుదుటిపై పడేలా సాంకేతికతను రూపొందించారు.

సూర్యుడి డైరెక్షన్, కిరణాలు ప్రసరించే యాంగిల్ కు అనుగుణంగా ఈ అద్దాలను ఏర్పాటు చేశారు. ఇందుకోసం చాలా తక్కువ సంఖ్యలో పైపులు, కుంభాకార, పుటాకార కటకాలతో కూడిన ఓ సిస్టమ్ ఏర్పాటు చేశారు. బెంగళూరుకు చెందిన ఆప్టికా సంస్థ వీటిని సమ కూర్చింది. ప్రత్యేక టెక్నాలజీ ఆధారంగా ఈ వ్యవస్థ 19 ఏళ్లు నిరాంతరాయంగా పని చేయనుంది. 19 ఏళ్ల తర్వాత మరోసారి సమయాన్ని సెట్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో ఎలాంటి ఉక్కు, ఇనుము, బ్యాటరీలు, విద్యుత్ ను వాడలేదని ఆలయ ట్రస్ట్ వెల్లడించింది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు