/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/Rakesh-Master-Son-Charan-Tej-Dance.jpg)
Rakesh Master Son: రాకేష్ మాస్టర్.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. ముఖ్యంగా సోషల్ మీడియాలో యాక్టీవ్ ఉండే వారికి ఈ పేరు మరింత సుపరిచితం. దాదాపు వేయికి పైగా సినిమా పాటలకు ఆయన నృత్య దర్శకత్వం వహించారు. ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ కొరియోగ్రాఫర్లుగా ఓ వెలుగు వెలుగుతున్న శేఖర్, జానీ మాస్టర్లు కూడా ఆయన దగ్గర శిష్యరికం చేసిన వారే.
అయితే.. ముక్కుసూటిగా మాట్లాడడం ఆయన కెరియర్ కు ముప్పు తెచ్చింది. అవకాశాలను దూరం చేసింది. దీంతో ఆయన ఇండస్ట్రీకి దూరమవుతూ వచ్చారు. అనంతరం కుటుంబ సమస్యలతో ఒంటరి వారయ్యారు. ఈ క్రమంలో మద్యానికి బానిసైన రాకేష్ మాస్టర్ చివరి దశలో అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. చివరికి వడదెబ్బకు గురై ప్రాణాలు కోల్పోయారు.తన కుమారుడిని హీరోను చేయాలని భావించిన రాకేష్ మాస్టర్.. ఆ కోరిక తీరకుండానే చనిపోయారు. అయితే.. తండ్రి పేరును నిలబెట్టడానికి ఆయన కుమారుడు చరణ్ తేజ్ (Charan Tej) బాగానే కష్టపడుతున్నట్లు తెలుస్తోంది.
రాకేష్ మాస్టర్ కు గతంలో నిర్వహించిన SRK Entertainments యూట్యూబ్ ఛానల్ ను ప్రస్తుతం ఆయన నిర్వహిస్తున్నాడు. ఈ ఛానల్ లో గత కొన్ని రోజులుగా ఆయన తన డ్యాన్స్ వీడియోలను అప్లోడ్ చేస్తున్నారు. ఆ వీడియోల్లో చరణ్ తేజ్ చేస్తున్న డ్యాన్స్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. రాకేష్ మాస్టర్ ను గుర్తుకు తెస్తున్నావంటూ ఆ వీడియోలకు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. తండ్రికి మించిన తనయుడు కావాలని ఆశీర్వదిస్తున్నారు. హీరోగా మారి నాన్న మాటలను నిలబెట్టు చరణ్ అంటూ మరికొందరు తమ కామెంట్లతో ప్రోత్సహిస్తున్నారు.