/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/rajni-jpg.webp)
Rajinikanth to meet chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబును (Chandrababu) పరామర్శించేందుకు సూపర్ స్టార్ రజనీకాంత్ శనివారం ఉదయం రాజమండ్రి జైలుకు రానున్నారు. ఈ మేరకు టీడీపీ నేతలకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. జైలు ములాఖత్‌లో భాగంగా బాబును రజనీ కలవనున్నారని చెబుతున్నారు.
ఇటీవల చంద్రబాబు అరెస్టుపై రజనీకాంత్ స్పందించిన సంగతి తెలిసిందే. తన మిత్రుడు చంద్రబాబు ప్రజాసంక్షేమం కోసం నిరంతరం పరితపించే గొప్ప పోరాట యోధుడని, ఈ తప్పుడు కేసులు.. అక్రమ అరెస్టులు ఆయనని ఏం చేయలేవని రజనీ ధీమా వ్యక్తంచేశారు. యువనేత నారా లోకేష్‌కి ఫోన్ చేసి పరామర్శించిన రజనీకాంత్ ధైర్యంగా ఉండాలని సూచించారు. తనకు ఆత్మీయ మిత్రుడైన చంద్రబాబు ఏ తప్పు చేయరని, చేసిన మంచి పనులు, నిస్వార్థమైన ప్రజా సేవ, ఆయనను క్షేమంగా బయటకు తీసుకొస్తాయని పేర్కొన్నారు.
మరోవైపు గురువారం రాజమండ్రి జైలులో చంద్రబాబును కలిసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్, హీరో బాలకృష్ణ, టీడీపీ యువనేత నారా లోకేష్ పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో జనసేన- తెలుగుదేశం వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీచేస్తాయని పవన్ అధికారికంగా ప్రకటించిన విషయం విధితమే.
చంద్రబాబు అరెస్టును ఖండిస్తున్న ప్రముఖులు..
ఇప్పటికే చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ ప్రముఖ దర్శకులు రాఘవేంద్రరావు, నిర్మాత అశ్వనీదత్, మరో నిర్మాత నట్టికుమార్ ప్రకటనలు చేశారు. అలాగే పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, సమాజ్ వాద్ పార్టీ అధినేత మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా, ఇతర సీనియర్ నేతలు చంద్రబాబు అరెస్టును తీవ్రంగా ఖండించారు.