Rajesh Mahasena: తాను టీడీపీలో కొనసాగడంపై రాజేష్ మహాసేన కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తుకు వ్యతిరేకంగా మాట్లాడింది మొదట జనసేన నేతలేనన్నారు. తనపై జనసేన నేతలు విమర్శలు చేసినప్పుడు.. ఆ పార్టీ అధినాయకత్వం కనీసం ఖండించలేదని రాజేష్ మహాసేన పేర్కొన్నారు.
Also Read: ఈ విషయంపై హైకోర్టుకు వెళ్తాం.. మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు.!
కూటమి ధర్మాన్ని ముందు జనసేన నేతలే తప్పారని.. కాబట్టి, కూటమి నుండి జనసేనను బయటకు పంపి.. ఆ తర్వాత తనను సస్పెండ్ చేస్తే ఓకేనన్నారు. మైనార్టీలకు వ్యతిరేకంగా పవన్ వ్యాఖ్యలు సరికాదని..టీడీపీకి ఇంత మెజార్టీ రావడం రాష్ట్ర అదృష్టమని అన్నారు.