Indian Railways : వేసవి కాలాన్ని(Summer Season) దృష్టిలో పెట్టుకుని సౌత్ సెంట్రల్ రైల్వే(South Central Railway) అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని 1079 ప్రత్యేక ట్రిప్పులను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. వేసవిలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇండియన్ రైల్వే ఆధ్వర్యంలోనూ దేశ వ్యాప్తంగా ప్రత్యేకంగా 9,111 ట్రిప్పు లు నడుపుతున్నామని అధికారుఉల పేర్కొన్నారు.
2023-24 ఆర్థిక సంవత్సరానికి(Financial Year 2023-24) గాను రైల్వే ట్రాక్ పునరుద్ధరణలో దక్షిణ మధ్య రైల్వే జోన్ నెట్‌వర్క్ రికార్డు సృష్టించినట్లు అధికారులు వివరించారు. గత ఆర్థిక సంవత్సరంలో 649 కిలోమీటర్ల మేర ట్రాక్ పునరుద్ధరణ చేశామని, ఈ సారి 45 శాతం అధికంగా పూర్తి చేసినట్లు తెలిపారు.
ఎనిమిది ప్రత్యేక రైళ్లు..
దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలో ఈ నెల 21 నుంచి జూన్ 15 వరకు ఎనిమిది ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. మైసూర్-ముజఫర్‌పూర్, బెంగళూరు-మాల్దాటౌన్, బెంగళూరు-బీదర్ మధ్య ఈ ప్రత్యేక రైళ్లు(Special Trains) రాకపోకలు కొనసాగిస్తాయన్నారు.
Also read: నేడు వైఎస్ షర్మిల నామినేషన్ ..ఇడుపుల పాయ లో ప్రత్యేక ప్రార్థనలు!