Rahul Sipliganj:రాహుల్ సిప్లిగంజ్.. నన్ను వదిలేయండి బాబోయ్!

గోషామహల్ నుంచి సీటును అభ్యర్థిస్తూ, రాహుల్ సిప్లిగంజ్ అప్లికేషన్ పెట్టుకున్నట్టు పుకార్లు వ్యాపించాయి. 2 రోజులుగా ఈ అంశంపై చూసీచూడనట్టు వ్యవహరించిన రాహుల్ సిప్లిగంజ్ కు ఇక స్పందించక తప్పలేదు. తనకు రాజకీయాలకు సంబంధం లేదని క్లారిటీ ఇచ్చాడు రాహుల్ సిప్లిగంజ్.

New Update
Rahul Sipliganj:రాహుల్ సిప్లిగంజ్.. నన్ను వదిలేయండి బాబోయ్!

Rahul Sipliganj: రాహుల్ సిప్లిగంజ్.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. యూట్యూబర్ గా ఉంటూ ఇండిపెండెంట్ మ్యూజిక్ వీడియోస్ చేసుకునే స్థాయి నుంచి ఇప్పుడు స్టార్ సింగర్ గా ఎదిగాడు. మధ్యలో బిగ్ బాస్ విన్నర్ గా కూడా నిలిచి, స్టార్ స్టేటస్ పొందాడు. ఇప్పడీ సింగర్ వార్తల్లో వ్యక్తిగా మారాడు. హాట్ టాపిక్ అయ్యాడు. అది కూడా వినోద రంగంలో కాదు. రాజకీయ రంగంలో రాహుల్ సిప్లిగంజ్ పేరు తెరపైకొచ్చింది.

తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో రాహుల్ సిప్లిగంజ్ పోటీ చేయబోతున్నాడనేది తాజా రూమర్. కాంగ్రెస్ పార్టీ నుంచి, గోషామహల్ స్థానం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా రాహుల్ సిప్లిగంజ్ రంగంలోకి దిగుతాడంటూ 2 రోజులుగా కథనాలు వస్తూనే ఉన్నాయి. ఎమ్మెల్యే అభ్యర్థుల కోసం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ దరఖాస్తులు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. వెయ్యికి పైగా అప్లికేషన్లు వచ్చాయి.

వీటిలో రాహుల్ సిప్లిగంజ్ సమర్పించుకున్న పత్రం కూడా ఉందంటూ ప్రచారం సాగింది. మరీ ముఖ్యంగా తనకు పట్టున్న గోషామహల్ నుంచి సీటును అభ్యర్థిస్తూ, రాహుల్ సిప్లిగంజ్ అప్లికేషన్ పెట్టుకున్నట్టు పుకార్లు వ్యాపించాయి. 2 రోజులుగా ఈ అంశంపై చూసీచూడనట్టు వ్యవహరించిన రాహుల్ సిప్లిగంజ్ కు ఇక స్పందించక తప్పలేదు. తనకు రాజకీయాలకు సంబంధం లేదని క్లారిటీ ఇచ్చాడు రాహుల్ సిప్లిగంజ్.

"అందరికీ నమస్కారం! నేను రాజకీయాల్లో రావట్లేదని చెప్పాలనుకుంటున్నాను, చాలా పుకార్లు వస్తున్నాయి. గోషామహల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానంటున్నారు. అదంతా ఫేక్ న్యూస్. గత కొన్ని రోజులుగా ప్రచారంలో ఉన్న మేటర్ అస్సలు నిజం కాదు. నేను పార్టీలకు అతీతంగా నాయకులందరినీ గౌరవిస్తాను. నేను ఆర్టిస్ట్‌ని, అందరినీ అలరించాలి. నా జీవితాంతం నేను అలరిస్తూనే ఉంటాను. నేను నా మ్యూజిక్ కెరీర్ ను కొనసాగిస్తాను. ఈ పరిశ్రమలో నేను చేయాల్సింది చాలా ఉంది. ఏ పార్టీ నుంచి నన్ను ఎవరూ సంప్రదించలేదు. నేను కూడా ఎవ్వర్నీ కలవలేదు. దయచేసి ఇలాంటి పుకార్లు ఆపండి."

ఇలా తను రాజకీయాల్లోకి రావట్లేదనే విషయంపై క్లారిటీ ఇచ్చాడు రాహుల్ సిప్లిగంజ్. ప్రస్తుతం ఇతడి కెరీర్ పీక్ స్టేజ్ లో ఉంది. రీసెంట్ గా ఆస్కార్ వేదికపై ఆర్ఆర్ఆర్ సాంగ్ పాడి మరింత పాపులర్ అయ్యాడు. అందుకే అతడిపై ఈ తరహా పుకార్లు వచ్చాయి. వాటిని రాహుల్ ఖండించాడు.

Advertisment
తాజా కథనాలు