Rage Rituals: ఆ అమ్మాయిలకు కోపం వస్తే.. లక్షలు ఖర్చు చేస్తారు.. ఎలా అంటే..

కోపం వస్తే నియంతరించుకోవడం చాలా కష్టం. అలాని కోపాన్ని ఎక్కువగా నియంతరించుకున్నా మానసికమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. అందుకే.. అమెరికా, యూరప్ లలో అమ్మాయిలు తమకు కోపం వస్తే లక్షలు ఖర్చు పెట్టి ఈవెంట్ కి వెళతారు. ఆ ఈవెంట్ వివరాలు ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు 

New Update
Rage Rituals: ఆ అమ్మాయిలకు కోపం వస్తే.. లక్షలు ఖర్చు చేస్తారు.. ఎలా అంటే..

Rage Rituals: మీకు కోపం వస్తే ఏం చేస్తారు? దీనికి సరైన సమాధానం చెప్పడం కష్టం. కోపం వచ్చిన పరిస్థితిని బట్టి.. కోపానికి కారణం.. కోపం రావడానికి కారణమైన వారితో అనుబంధం.. ఇలా ఎన్నో పరిస్థితులు కోపం వచ్చినపుడు మనం ఎలా ప్రవర్తిస్తాం అనేది ఆధారపడి ఉంటుంది. అయితే, కోపం ఏ విధంగానూ సరైనది కాదు. కోపం ఒక వ్యక్తిని అన్నిరకాలుగాను తినేస్తుందని అంటారు.  ఎందుకంటే కోపంలో ఒక వ్యక్తి తాను ఏమి చేస్తున్నాడో ఏది సరైనదో ఏది కాదో అర్ధం కానీ పరిస్థితిలోకి వెళ్ళిపోతారు. అందుకే అందరం కోపాన్ని నియంత్రించాలని ప్రయత్నాలు చేస్తాం. దానికోసం ఎన్నో విధానాలూ అవలంబిస్తూ ఉంటాం. ఇందులో యోగా నుండి ధ్యానం వరకు ఉంటాయి. కానీ, కోపం తగ్గించుకోవడానికి ఒక వింత పని చేసే జనాలు ఉన్నారు. పైగా దానికోసం లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఏమిటి ఆశ్చర్యపోతున్నారా? కోపాన్ని నియంత్రించుకోవడానికి డబ్బు ఖర్చుపెట్టడం ఏమిటని అనుకుంటున్నారా? అయితే ఈ విషయం గురించి తెలుసుకోవాల్సిందే. 

అమెరికా అలాగే అనేక యూరోపియన్ దేశాల్లో ఆడపిల్లలు తమ కోపాన్ని తగ్గించుకోవడానికి విచిత్రమైన విధానాన్ని ఎంచుకుంటున్నారు. వీరు ఎంచుకునే ట్రెండ్ కు మంచి పేరు కూడా ఉంది. అదే  'Rage Rituals'. 

ఏమి చేస్తారు?
 'Rage Rituals' లో ఆడవాళ్లు చేసేపని తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ ట్రెండ్ లో అడవి మధ్యలో పార్టీ ఏర్పాటు చేస్తారు. దానికి లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు. ఈ పార్టీ కోసం అడవిలోకి వెళ్లిన ఈ ఆడవాళ్లు ఏమి చేస్తారాంటే.. గట్టిగా అరుస్తూ ఉంటారు. అలా అరిచి అరచి కోపాన్ని తగ్గించుకుంటారు. అలాగే అక్కడ వాళ్ళిష్టం వచ్చిన విధ్వంసాన్ని సృష్టిస్తారు. ఈ విషయాన్నీ న్యూయార్క్ పోస్ట్ రిపోర్ట్ చేసింది. ఈ విధ్వంసం సృష్టించే అరుపుల ప్రోగ్రామ్ కోసం దాదాపుగా 5 -6 లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు. 

Also Read: ల్యాప్‌టాప్ వేడెక్కుతోందా? వెంటనే ఇలా చేయండి.

ఇది ఎవరు ఏర్పాటు చేస్తారు?
మియా మ్యాజిక్ అని పిలువబడే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అమెరికాలో 'రేజ్ రిచువల్స్' నిర్వహిస్తోంది.  ఇందులో చాలా మంది మహిళలు తమ కోపాన్ని డబ్బులు కట్టి మరీ వెళ్లగక్కారు. మియా మ్యాజిక్‌ని మియా బాండుచి అని కూడా అంటారు. ఆమె సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్. USA టుడే నివేదిక ప్రకారం, మియా ఇలా చెప్పింది, 'మనమందరం అనుభూతి చెందాల్సిన కొన్ని ప్రత్యేక భావోద్వేగాలు ఉన్నాయి. పురుషులు ఏడవాలి ఎందుకంటే అది వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది, అదే విధంగా మహిళలు తమ కోపాన్ని వెళ్లగక్కాలి. అప్పుడే మనసు తేలికపడి సంతోషం రెట్టింపు అవుతుంది అంటోందీమె. 

ఫ్రాన్స్ లో త్వరలో..
గత కొన్నేళ్లుగా తాను ఇలాంటి ఫంక్షన్లు చాలా నిర్వహించానని మియా చెప్పింది. ఆమె వచ్చే ఆగస్టు నెలలో ఫ్రాన్స్‌లో ఒక ఫంక్షన్‌ను నిర్వహించబోతోంది.  దీని ఛార్జి  $6,500 నుండి $8,000 వరకు ఉంటుంది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు