Crime News: NRI కళాశాలలో దారుణం.. విద్యార్థినిలపై HOD లైంగిక వేధింపులు..!

విశాఖ జిల్లా సంగివలసలోని NRI కళాశాలలో విద్యార్థినిలపై లైంగిక వేధింపుల సంఘటన చోటుచేసుకుంది. కళాశాలలోని రేడియాలజీ డిపార్ట్‌మెంట్ హెడ్ తుమ్మల నాగేశ్వరరావు లైంగిక వేధింపులకు పాల్పడటంతో విద్యార్థినులు దిశ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

New Update
Crime News: NRI కళాశాలలో దారుణం.. విద్యార్థినిలపై HOD లైంగిక వేధింపులు..!

Vishaka: విశాఖ జిల్లా భీమిలి మండలం సంగివలసలోని NRI కళాశాలలో విద్యార్థినిలపై లైంగిక వేధింపుల సంఘటన చోటుచేసుకుంది. కళాశాలలోని రేడియాలజీ డిపార్ట్‌మెంట్ హెడ్ తుమ్మల నాగేశ్వరరావు లైంగిక వేధింపులకు పాల్పడటంతో విద్యార్థినులు ఎండాడలోని దిశ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు.

HOD లైంగిక వేధింపులు..

బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. తరగతులు జరుగుతుండగానే ఈ నెల 3న రేడియాలజీ డిపార్ట్‌మెంట్ హెడ్ తుమ్మల నాగేశ్వరరావు తమను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని కళాశాల డీన్ పివి సుధాకర్ కు విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. అంతకుముందే ఓసారి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని మరోసారి డీన్ దృష్టికి తీసుకెళ్లారు. ఫిర్యాదు చేసి 20 రోజులు అవుతున్నా కనీస చర్యలు చేపట్టకపోవడంతో ఏబీవీపీ కార్యకర్తలతో కళాశాలకు చేరుకుని విద్యార్థినులు వాగ్వివాదానికి దిగారు.

Also Read: పంట పొలాల్లో వజ్రాల వేట.. రైతుకు దొరికిన వజ్రం.. ఖరీదు తెలిస్తే అవాక్కవుతారు..!

కళాశాలలో విచారణ..

డీన్ ఈ విషయాన్ని కళాశాల అంతర్గత ఫిర్యాదుల కమిటీకి నివేదించామని, వేసవి సెలవులు కావడంతో కమిటీ సభ్యులు అందుబాటులో లేకపోవడంతో చర్యలు ఆలస్యమైందన్నారు. అనంతరం విశాఖ నగర పరిధి ఎండాడ దిశ పోలీస్ స్టేషన్లో హెచ్ ఓ డి తుమ్మల నాగేశ్వరరావుపై ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో దిశ ఏసిపి వివేకానంద ఆదేశాలతో సీఐ టి కళ్యాణి ఎన్ఆర్ఐ కళాశాలలో విచారణ చేపట్టారు. విద్యార్థినిలతో పాటు పలువురిని విచారించారు.

చర్యలు చేపడతాం..

ఈ సందర్భంగా సిఐటి కళ్యాణి మాట్లాడుతూ.. కళాశాల హెచ్ ఓడి లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారంటూ ముగ్గురు విద్యార్థులు పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేశారన్నారు. ఈ నేపథ్యంలోనే విచారణ చేపట్టామని అనంతరం కేసు నమోదు చేసి చర్యలు చేపడతామన్నారు. ఈ నేపథ్యంలో కళాశాల డీన్ పివి సుధాకర్ ను వివరణ కోరగా ఇప్పటికే హెచ్ ఓడి తుమ్మల నాగేశ్వరరావు పై కళాశాల అంతర్గత ఫిర్యాదుల కమిటీ విచారణ చేపట్టిందని విచారణ అనంతరం చర్యలు చేపడతామన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు