Villagers stopped MLA Sridevi : వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవికి చేదు అనుభవం.. అడ్డుకున్న గ్రామస్తులు

కర్నూలు జిల్లా పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవికి చేదు అనుభవం ఎదురైంది. పత్తికొండ మండలం పుచ్చకాయలమడలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నిర్వహించారు. గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే శ్రీదేవి ఖాసీం స్వామి దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ క్రమంలో మహిళలు, గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. ఎమ్మెల్యే శ్రీదేవికి వ్యతిరేకంగా నినాదాలు పెద్ద ఎత్తున చేశారు. గ్రామానికి ఏం చేశారని నిలదీశారు. గో బ్యాక్.. డౌన్ డౌన్ ఎమ్మెల్యే అంటూ నినాదాలతో హోరెత్తించారు గ్రామస్తులు. గొడవలు జరిగే అవకాశం ఉందని ముందే సమాచారం అందుకున్న పోలీసులు.. పుచ్చకాయలమడ గ్రామానికి చేరుకున్నారు. ఒక్కసారిగా గ్రామస్తులు అక్కడికి దూసుకు రావటంతో అప్రమత్తమైన పోలీసులు గ్రామస్తులను అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్యే శ్రీదేవి అక్కడి నుంచి వెనుదిరగారు. ఎమ్మెల్యే వెళ్లిపోవడంలో ఉద్రిక్త వాతావరణం సాధారణ స్థితికి వచ్చింది.

New Update
Villagers stopped MLA Sridevi : వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవికి చేదు అనుభవం.. అడ్డుకున్న గ్రామస్తులు

కర్నూలు జిల్లా పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవికి చేదు అనుభవం ఎదురైంది. పత్తికొండ మండలం పుచ్చకాయలమడలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నిర్వహించారు. గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే శ్రీదేవి ఖాసీం స్వామి దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ క్రమంలో మహిళలు, గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. ఎమ్మెల్యే శ్రీదేవికి వ్యతిరేకంగా నినాదాలు పెద్ద ఎత్తున చేశారు. గ్రామానికి ఏం చేశారని నిలదీశారు. గో బ్యాక్.. డౌన్ డౌన్ ఎమ్మెల్యే అంటూ నినాదాలతో హోరెత్తించారు గ్రామస్తులు.

గొడవలు జరిగే అవకాశం ఉందని ముందే సమాచారం అందుకున్న పోలీసులు.. పుచ్చకాయలమడ గ్రామానికి చేరుకున్నారు. ఒక్కసారిగా గ్రామస్తులు అక్కడికి దూసుకు రావటంతో అప్రమత్తమైన పోలీసులు గ్రామస్తులను అడ్డుకున్నారు. అనంతరం చెదరగొట్టారు. తమ కాలనీలోకి రావద్దని నినాదాలు చేస్తూ.. గ్రామస్తులు ముళ్ల కంపలు అడ్డుగా పెట్టారు.

ఆ తర్వాత ఎమ్మెల్యే ఎస్సీ కాలనీలోకి వెళ్లారు. అక్కడ కూడా టీడీపీ, వైసీపీ వర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు బందో బస్తును పెంచారు. వీధి వీధికి వెళ్లే మార్గంలో గ్రామస్తులు పోలీసులు అడ్డుగా నిలిచారు. అనంతరం పలువురు గ్రామస్తులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వైసీపీ ప్రభుత్వంలో ఒక్క రోడ్డు, మురుగు కాల్వ నిర్మించిన దాఖలాలు లేవని గ్రామస్థులు ఆరోపించారు. దీంతో ఎమ్మెల్యే శ్రీదేవి అక్కడి నుంచి వెనుదిరగారు. ఎమ్మెల్యే వెళ్లిపోవడంలో ఉద్రిక్త వాతావరణం సాధారణ స్థితికి వచ్చింది.

Advertisment
తాజా కథనాలు