Pushpa 2 : యూట్యూబ్ లో దుమ్ములేపుతున్న 'పుష్ప 2 ' సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ అందుకుందంటే..?

'పుష్ప 2' టైటిల్ సాంగ్ యూట్యూబ్ లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సాంగ్ విడుదలైన అన్ని భాషల్లో కలిపి 150 మిలియన్‌ వ్యూస్‌ సొంతం చేసుకుంది. అలాగే అన్ని భాషలు కలిపి 2.5 మిలియన్స్ లైక్స్ కూడా వచ్చాయి. ఈ విషయాన్ని తెలియజేస్తూ ‘పుష్ప’ టీమ్‌ సంతోషం వ్యక్తం చేసింది..

Pushpa 2 : యూట్యూబ్ లో దుమ్ములేపుతున్న 'పుష్ప 2 ' సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ అందుకుందంటే..?
New Update

Pushpa 2 Title Song : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'పుష్ప: ది రూల్'. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలు పెంచింది. ముఖ్యంగా టైటిల్ సాంగ్ ఇప్పటికే అభిమానులను ఎంతగానో అలరించింది. తాజాగా ఈ సాంగ్ యూట్యూబ్ లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సాంగ్ విడుదలైన అన్ని భాషల్లో కలిపి 150 మిలియన్‌ వ్యూస్‌ సొంతం చేసుకుంది.

అంతేకాదు తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో కలిపి ఈ సాంగ్ కి 2.5 మిలియన్స్ లైక్స్ రావడం విశేషం. ఈ విషయాన్ని తెలియజేస్తూ ‘పుష్ప’ టీమ్‌ సంతోషం వ్యక్తం చేసింది. ఈ సినిమా టైటిల్ సాంగ్‌కు ఇంతటి స్థాయిలో ఆదరణ లభించడంపై అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది. ఈ రికార్డ్ తో బన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Also Read : ఎన్నో ఏళ్లుగా ఇబ్బంది పడుతున్నాం.. కాస్త పట్టించుకోండి, వైరల్ అవుతున్న సీనియర్ హీరో ట్వీట్

ఇక ఈ మూవీ షూటింగ్ విషయానికొస్తే.. ఇటీవలే వెకేషన్ నుంచి తిరిగొచ్చిన బన్నీ.. ఆగస్టు తొలి వారం నుంచి తిరిగి ‘పుష్ప2’ సెట్లోకి అడుగు పెట్టనున్నారు. ఇప్పటికే కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేశారు. రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఇతర నటులపై కొన్ని సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ఈ కొత్త షెడ్యూల్‌లో అల్లు అర్జున్‌పై పతాక సన్నివేశాల్ని తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది.

#allu-arjun #pushpa-2-title-song
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe