పంజాగుట్ట ఇన్స్పెక్టర్‎పై సస్పెన్షన్ వేటు.. మాజీ ఎమ్మెల్యే కొడుకును కేసు నుంచి తప్పించే ప్రయత్నం

రాష్ డ్రైవింగ్ కేసులో మాజీ ఎమ్మెల్యే కొడుకును తప్పించేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలపై పంజాగుట్ట ఇన్స్పెక్టర్ దుర్గారావును ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. కేసు విచారణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఆయనపై సస్పెన్షన్ వేటు వేసినట్లు అధికారులు తెలిపారు.

New Update
పంజాగుట్ట ఇన్స్పెక్టర్‎పై సస్పెన్షన్ వేటు.. మాజీ ఎమ్మెల్యే కొడుకును కేసు నుంచి తప్పించే ప్రయత్నం

Punjagutta: రాష్ డ్రైవింగ్ కేసులో మాజీ ఎమ్మెల్యే కొడుకును తప్పించేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలపై పంజాగుట్ట ఇన్స్పెక్టర్ దుర్గారావును ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. కేసు విచారణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఆయనపై సస్పెన్షన్ వేటు వేసినట్లు అధికారులు తెలిపారు.

ఇది కూడా చదవండి: కరోనా పంజా.. తెలంగాణలో పెరుగుతున్న కేసులు.. జనంలో టెన్షన్

ప్రజా భవన్ వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లను ఢీకొట్టిన ఘటనకు సంబంధించిన కేసు కొత్త మలుపులు తీసుకుంది. చివరికి ఆ కేసు పోలీసులకు చుట్టుకుంది. ఈ నెల 24న అర్ధరాత్రి బేగంపేటలోని ప్రజా భవన్ వద్ద ఉన్న బారికేడ్లను బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సోహైల్ కారుతో ఢీకొట్టాడు. మద్యం మత్తులో ఉన్న ఆయన కారులో ప్రయాణిస్తూ ఢీకొట్టగా, పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఎమ్మెల్యే కొడుకును ఆ కేసు నుండి తప్పించి పోలీసులు మరో వ్యక్తిని అందులో చేర్చారు.


మాజీ ఎమ్మెల్యే కొడుకును కేసు నుంచి తప్పించడంలో ఇన్‌స్పెక్టర్‌ దుర్గారావు పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు అంతర్గత విచారణ జరిపించారు. అందులో దుర్గారావు పాత్రపై ఓ నిర్ధారణకు వచ్చిన అధికారులు ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న షకీల్ కొడుకు పరారీలో ఉన్నారు. దీంతో లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు.

Advertisment
తాజా కథనాలు