PSPCL JE Recruitment 2024: పంజాబ్ స్టేట్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దీనికి అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు PSPCL అధికారిక వెబ్ సైట్ (pspcl.in) ను సందర్శించి ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మార్చి 1. 2024.
ఖాళీ వివరాలు:
ఈ డ్రైవ్ ద్వారా మొత్తం 544 పోస్టులకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. వీటిలో జూనియర్ ఇంజనీర్/ఎలక్ట్రికల్: 378, జూనియర్ ఇంజనీర్/సబ్ స్టేషన్: 112, జూనియర్ ఇంజనీర్/సివిల్: 54 పోస్టులు ఉన్నాయి.
ఎలా దరఖాస్తు చేయాలంటే..
ముందుగా ఆసక్తి ఉన్న అభ్యర్థులు PSPCL pspcl.in అధికారిక వెబ్‌సైట్ లోనికి వెళ్లాలి. దీని తర్వాత హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న రిక్రూట్‌మెంట్ లింక్‌పై క్లిక్ చేయాలి. అక్కడ అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ వివరాలన్ని పూర్తి చేసిన తరువాత లాగిన్ అవ్వాలి.
దీని తర్వాత ఫారమ్‌ను పూర్తి చేసి దానికి తగిన రుసుమును చెల్లించాలి. దీని తర్వాత సబ్‌మిట్‌పై క్లిక్ చేసి పేజీని డౌన్‌లోడ్ చేసుకోవాలి.
దానికి సంబంధించిన హార్డ్ కాపీని దగ్గర ఉంచుకోవాలి.
దరఖాస్తు రుసుము
షెడ్యూల్ కులం (SC), వికలాంగుల కేటగిరీ మినహా దరఖాస్తు చేసుకునే అభ్యర్థులందరికీ దరఖాస్తు రుసుము రూ. 1416. కాగా, షెడ్యూల్ కులాలు, వికలాంగుల కేటగిరీ వ్యక్తులకు దరఖాస్తు రుసుము రూ. 885 గా ఉంది.
వయో పరిమితి
దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 ఏళ్ల కంటే తక్కువ ఉండకూడదు. 37 ఏళ్లు మించకూడదు.
Also Read: DigiYatra: మార్చి 31 నుంచి చెన్నై విమానాశ్రయంలో డిజి యాత్ర సదుపాయం ప్రారంభం!