Baptla: బాపట్ల జిల్లా చీరాలలో గతరాత్రి హత్యకు గురైన ఆరిఫ్ (18) బంధువులు ఆందోళన చేపట్టారు. స్థానిక చీరాల గడియారం స్తంభం వద్ధ నిరసనకు దిగారు. ఆరీఫ్ ని హత్య చేసి, అతని స్నేహితుడు మనోజ్ పై దాడిచేసిన వారిని వెంటనే అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని ఆరీఫ్ బంధువులు, ముస్లిం పెద్దలు నినాదాలు చేశారు.
Also Read: అమాయకపు ముఖం పెడితే ప్రజలు నమ్మే స్థితిలో లేరు.. పెద్దిరెడ్డిపై మంత్రి అనగాని సెటైర్లు.!
మృతుని కుటుంబానికి ప్రభుత్వం తరుఫున న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కొంతసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొనడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. DSP జోక్యం చేసుకొని నిందితులను శిక్షిస్తామని హామీ ఇవ్వడంతో వివాదం ముగిసింది.