పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ ఒక్క మెజారిటీతో గెలిచి చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. దానికి తోడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కీలకంగా మారడంతో చంద్రబాబు నాయుడు కింగ్ మేకర్ గా ఎదిగారు.
చంద్రబాబు నాయుడు భార్య ఆస్తి విలువ కేవలం 12 రోజుల్లోనే రూ.1225 కోట్లకు పెరిగింది. చంద్రబాబు నాయుడు స్థాపించిన హెరిటేజ్ ఫుడ్స్ షేర్లు 12 రోజుల్లో 105% పెరిగాయి. అలాగే ఇందులో వాటా ఉన్న చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ ఆస్తి విలువ కూడా రూ.724 కోట్లు పెరిగింది. ప్రస్తుతం హెరిటేజ్ ఫుడ్స్ మొత్తం విలువ రూ.2391 కోట్లు గా ఉంది.
ఎన్నికల ఫలితాలు వెలువడే ముందురోజు జూన్ 3న హెరిటేజ్ ఫుడ్స్ షేర్ రూ.424 వద్ద ట్రేడవుతుండగా, ఇప్పుడు ఒక్కో షేరు రూ.660 వద్ద ట్రేడవుతోంది.దీంతో 12రోజుల్లో నే రూ.1225 కోట్లకు చేరింది. హెరిటేజ్ కంపెనీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశా, ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌తో సహా పలు రాష్ట్రాల్లో వ్యాపార యూనిట్లు ఉన్నాయి.