Projects Cost: భారీగా పెరిగిపోయిన ప్రాజెక్టుల నిర్మాణ ఖర్చులు.. ఎంతంటే..  

మన దేశంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం చేపడుతున్న 1,831 ప్రాజెక్టుల మొత్తం అసలు వ్యయం రూ. 25,10,577.59 కోట్లు అయితే వాటిని పూర్తి చేయడానికి అంచనా వ్యయం రూ.29,50,997.33 కోట్లు. అంటే మొత్తం 17.54 శాతం ఖర్చు పెరిగింది.

Projects Cost: భారీగా పెరిగిపోయిన ప్రాజెక్టుల నిర్మాణ ఖర్చులు.. ఎంతంటే..  
New Update

Projects Cost: మనదేశంలో రూ.150 కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడితో చేపట్టిన 421 మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల వ్యయం నవంబర్‌లో రూ.4.40 లక్షల కోట్లకు పైగా పెరిగింది. ఈ సమాచారం అధికారిక నివేదికలో పేర్కొన్నారు.  స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ ఈ రిపోర్ట్ కారం, దాని పర్యవేక్షణలో రూ. 150 కోట్లు, అంతకంటే ఎక్కువ పెట్టుబడితో 1,831 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో, 421 ప్రాజెక్టులు ఖర్చును అధిగమించాయి అదేవిధంగా  845 ప్రాజెక్టులు ఆలస్యం అవుతూ వస్తున్నాయి. 

మంత్రిత్వ శాఖ తాజా నెలవారీ నివేదిక ప్రకారం, పర్యవేక్షణలో ఉన్న 1,831 ప్రాజెక్టుల మొత్తం అసలు వ్యయం(Projects Cost) రూ. 25,10,577.59 కోట్లు అయితే వాటిని పూర్తి చేయడానికి అంచనా వ్యయం రూ.29,50,997.33 కోట్లు. ఈ విధంగా మొత్తం వ్యయం రూ.4,40,419.74 కోట్లు అంటే 17.54 శాతం పెరిగింది. నవంబర్ 2023 వరకు ఈ ప్రాజెక్టుల వ్యయం రూ. 15,58,038.07 కోట్లు అని, ఇది ప్రాజెక్టుల అంచనా వ్యయంలో 52.80 శాతం అని నివేదిక చెబుతోంది.

Also Read: భారీగా పెరిగిన బంగారం స్మగ్లింగ్.. ఈ లెక్కలు చూడండి.. 

అయితే, తాజా షెడ్యూల్‌ ప్రకారం ఆలస్యాన్ని(Projects Cost) లెక్కిస్తే, ఆలస్యమైన ప్రాజెక్టుల సంఖ్య 629కి తగ్గుతుందని నివేదిక పేర్కొంది. 308 ప్రాజెక్టులకు ఆమోదం పొందిన సంవత్సరం గానీ, నిర్మాణ కాల వ్యవధి గానీ ఇవ్వలేదని పేర్కొంది. 845 ఆలస్యమైన ప్రాజెక్టులలో 204 ఒకటి నుంచి 12 నెలల వరకు ఆలస్యం కాగా 198 ప్రాజెక్టులు 13-24 నెలల ఆలస్యంగా ఉన్నాయి. 322 ప్రాజెక్టుల్లో 25-60 నెలల జాప్యం జరుగుతుండగా, 121 ప్రాజెక్టులు ఐదేళ్లకు పైగా ఆలస్యమవుతున్నాయి.

845 ఆలస్యమైన ప్రాజెక్టుల సమయం(Projects Cost) సగటున 36.64 నెలలు పెరిగింది. నివేదిక ప్రకారం, భూసేకరణలో జాప్యం, అటవీ, పర్యావరణ అనుమతులు పొందడంలో జాప్యం, మౌలిక సదుపాయాల మద్దతు లేకపోవడం వల్ల వివిధ ప్రాజెక్టులు అమలు చేసే ఏజెన్సీలు జాప్యానికి కారణమని పేర్కొంది.

Watch this interesting Video:

#projects #project-cost
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe