Hyderabad: నిర్మాత దిల్ రాజు అల్లుడు అక్షిత్ రెడ్డికి చెందిన కోటి రూపాయలకు పైగా విలువ చేసే కారు జూబ్లీహిల్స్ ప్రాంతంలో అపహరణకు గురైంది. జూబ్లిహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా గంట వ్యవధిలోనే నిందితుడిని పట్టుకొని కారును స్వాధీనం చేసుకున్నారు.
దిల్ రాజు అల్లుడు అక్షిత్ రెడ్డి శుక్రవారం ఉదయం కోటిన్నర విలువ చేసే కారులో జూబ్లిహిల్స్ ప్రాంతంలోని దసపల్లా హోటల్ కు వెళ్లారు. కార్ బయట పార్క్ చేసి తిరిగి 40 నిమిషాల వచ్చి చూస్తే కారు కనిపించలేదు. దాంతో కారు అపహరణకు గురైందని జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలించగా కారు జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద సిగ్నల్ జంప్ చేసినట్లు తెలిసింది. వెంటనే అక్కడున్న సిబ్బందిని అప్రమత్తం చేసి ఆ వ్యక్తిని పట్టుకున్నారు. పట్టుబడిన వ్యక్తిని కారు ఎందుకు చోరీ చేసావని అడగగా ఆ వ్యక్తి చెప్పిన సమాధానానికి పోలీసులు ఆశ్చర్యపోయారు. తానూ ఆకాష్ అంబానీ వ్యక్తిగత సహాయకుడినని, కేటీఆర్ కారు తీసుకెళ్లానని, తాను, హృతిక్ రోషన్ ఇద్దరు అంబానీని కలవడానికి కారులో వెళ్తున్నామని చెప్పాడు.
ఈయన చెప్పిన మాటలకు ఆశ్చర్యపోయిన పోలీసులు అతని గురించి ఆరా తీయగా.. అతనికి మతి స్థిమితం లేదని, తాను బ్రైట్ లైఫ్ ఫౌండేషన్ సంస్థలో చికిత్స పొందుతున్నాడని గుర్తించారు. అలాగే ఆ నిందితుడు మన్సూరాబాద్ ప్రాంతానికి చెందిన మల్లెల సాయికిరణ్‌గా గుర్తించారు.
Also Read: Posani Krishna Murali: ఇక నుంచి వైఎస్సార్ రంగస్థల పురస్కారాలు: పోసాని కీలక ప్రకటన