Telangana Elections 2023: ఆ రెండు పార్టీలు ఒక్కటే..వాళ్లకు ఉద్యోగాలివ్వకండి: ప్రియాంకగాంధీ..!!

Telangana Elections 2023:  ఆ రెండు పార్టీలు ఒక్కటే..వాళ్లకు ఉద్యోగాలివ్వకండి: ప్రియాంకగాంధీ..!!
New Update

బీఆర్ఎస్, బీజేపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు..ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ. కొమురంభీం జిల్లా ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఏర్పటు చేసిన కాంగ్రెస్ సభలో ఆమె ప్రసంగించారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ రెండూ ఒక్కటేనని బీఆర్ఎస్ కు ఓటు వేస్తే బీజేపీకి ఓటు వేసినట్లే అన్నారు. ఈసారి కేసీఆర్,కేటీఆర్ లకు ఉద్యోగాలు ఇవ్వొదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణ రాష్ట్రం డెవలప్ మెంట్ సాధ్యమవుతుందన్నారు. కేసీఆర్ 10ఏళ్ల పాలనలో ప్రజల సొమ్ముతో ప్రాజెక్టులు కట్టి కమిషన్ల కోసం స్కాంలు చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకే ఆనాడు సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇందిరాగాంధీ మరణించే వరకు కూడా ప్రతిక్షణం ప్రజల బాగోగుల గురించి మాత్రమే ఆలోచించేవారని ప్రియాంకగాంధీ అన్నారు. భూమిలేని నిరుపేదల కోసం 7లక్షల ఎకరాల భూమి ధారాతత్తం చేసింది ఇందిరాగాంధీనే అంటూ గుర్తు చేశారు.

ఆ ఘనత ఇందిరాగాంధీకే దక్కుతుంది:
అంతేకాదు ఇంటిగ్రేడెట్ ట్రైబల సబ్ ప్లాన్ అందించిన ఘటన ఇందిరమ్మకు దక్కుతుందన్నారు. తెలంగాణ ఉద్యమంలో సోనియాగాంధీ ప్రజల జీవన విధానంకోసం వారుపడుతున్న కష్టాలను చూసి చలించిపోయి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి బీఆర్ఎస్ 10 ఏళ్లుగా పాలన నడిపిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బీఆర్ ఎస్ సర్కార్ ఏమైనా డెవలప్ మెంట్ చేసిందా అంటు ప్రశ్నించారు ప్రియాంకగాంధీ. ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు, రైతుల కష్టాలు తీరాయా అని ప్రశ్నించారు. బీఆర్ఎష్ సర్కార్ తెలంగాణ లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అన్యాయం చేసిందని మండిపడ్డారు. రైతులకు 1లక్షరూపాయల రుణమాఫీ హామీ ఇచ్చి నెరవేర్చలేదని ఫైర్ అయ్యారు. ఛత్తీస్ గఢ్, కర్నాటక, రాష్ట్రాల్లో కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటు అయ్యిందని..కాంగ్రెస్ పాలనలో రెండు లక్షల ఉద్యోగాలు అవకాశాలుకల్పించామని ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ వ్యాఖ్యానించారు.

లక్ష ఉద్యోగాలకు మేము సిద్ధం:
తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే లక్ష ఉద్యోగాలు ఇఛ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రియాంక గాంధీ అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ను అధికారంలోకి తీసుకువస్తే..డెవలప్ మెంట్, అవినీతి లేని సర్కాన్ ను నిర్మించి తెలంగాణ ప్రజలకు మరింత చేరువ అవుతామన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ మేనిఫెస్టో 6 గ్యారెంటీలతో ముందుకువచ్చిందన్నారు. ఇచ్చిన హామీలను తెలంగాణ రాష్ట్ర ప్రజలు గుర్తించాలన్మనారు.

6 గ్యారెంటీలు ఖచ్చితంగా అందిస్తాం :
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 6 గ్యారెంటీలను కచ్చితంగా అందిస్తామన్నారు. ప్రతినెలా మహాలక్ష్మీ యోజన కింద మహిళలకు రూ. 2500 మహిళలకు ఫ్రీగా బస్సు సౌకర్యం, 500 రూపాయలకే గ్యాస్, రైతు భరోసా కింద ఏడాదికి రూ. 15వేలు, వ్యవసాయ కూలీలకు రూ. 12వేలు, గ్రుహ జ్యోతి 200యూనిట్ల ఫ్రీ కరెంట్, వ్యవసాయానికి 24గంటల త్రీఫేస్ ఫ్రీ కరెంట్ ఇందిరమ్మ ఇల్లు సొంతస్థలం ఉన్నవారికి 5లక్షల సహాయం, ఆరోగ్య యువజన శ్రీ పదిలక్షల వైద్య భరోసా బీమా సౌకర్యొంతోపాటు మరిన్ని పథకాలను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. కులం, మతం, రాజకీయం కోసం ఆలోచించే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను ప్రజలు నమ్మవద్దన్నారు.

కేసీఆర్, కేటీఆర్ కు ఉద్యోగాలు ఇవ్వకండి:
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 2లక్షల ఉద్యోగాలు ఇస్తామం..మీరు మాత్రం కేసీఆర్, కేటీఆర్ లకు ఉద్యోగాలు ఇవ్వకండన్నారు. కేసీఆర్ 10ఏళ్ల కాలంలోతెలంగాణను దోచుకున్నారని మండిపడ్డారు.

ఇది కూడా చదవండి: వాల్మీకి బోయలను ఎస్టీలుగా మార్చేదాక కేంద్రంతో కొట్లాడుడే: సీఎం కేసీఆర్..!!

#telangana-elections-2023
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe