PM Modi’s letter to Gaddar’s wife: ప్రజాగాయకుడు గద్దర్ అనారోగ్యంతో మృతి చెందినట్టు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. దీంతో గద్దర్ మృతి పై ప్రధాని మోడీ (PM Modi)చాలా బాధ పడినట్టు తెలిపారు. ఈ మేరకు ఆయన గద్దర్ భార్య గుమ్మడి విమలకు లేఖ రాశారు. అయితే ఈ లేఖ రాసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఇక లేఖలో ప్రధాని గద్దర్ భార్య విమల ఇంకా కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గద్దర్ మృతి గురించి తెలిసి చాలా బాధపడినట్టు అందులో మోడీ పేర్కొన్నారు. తీవ్ర దు:ఖంలో ఉన్న ఈ సమయంలో గద్దర్ కుటుంబసభ్యులకు హృదయపూర్వక సానుభూతి తెలుపుతున్నట్టుగా లేఖలో తెలిపారు.
ఆయన కుటుంబ సభ్యుల దు:ఖాన్ని మాటల్లో వ్యక్త పరచలేనని మోడీ పేర్కొన్నారు. గద్దర్ కుటుంబసభ్యులకు, ఆయన శ్రేయోభిలాషులకు ఈ బాధను తట్టుకునే శక్తిని ప్రసాదించాలని మోడీ కోరారు. అయితే గద్దర్ పాటలు,ఇతివృత్తాలు సమాజంలోని బడుగుబలహీనవర్గాలు ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రతిబింబిస్తాయని మోడీ అన్నారు. తెలంగాణ సాంప్రదాయక కళారూపాన్ని పునరుజ్జీవింపచేయడంలో ఆయన చేసిన కృషి చిరకాలం గుర్తుండి పోతుందని మోడీ లేఖలో పేర్కొన్నారు.
Also Read: నేను కావాలని చేయలేదు..అనుకోకుండా జరిగింది.. సారీ కూడా చెప్పాను: తలసాని!!