Surat Diamond Bourse: నేడు సూరత్ డైమండ్ బర్స్ ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ...దాని ప్రత్యేకత ఏంటో తెలుసా?

ప్రపంచంలో అతిపెద్ద కార్యాలయం సూరత్ డైమండ్ బోర్స్ ను నేడు ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. సూరత్ లోని ఖజోద్ ప్రాంతంలో నిర్మించిన ఈ కార్పొరేట్ ఆఫీస్ హబ్...రాష్ట్ర, దేశ ఆర్థికాభివృద్ధికి మైలురాయిగా మారనుంది.

New Update
Surat Diamond Bourse: నేడు సూరత్ డైమండ్ బర్స్ ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ...దాని ప్రత్యేకత ఏంటో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్ద కార్పొరేట్‌ ఆఫీస్‌ హబ్‌ 'సూరత్‌ డైమండ్‌ బోర్స్‌'ను ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. సూరత్ విమానాశ్రయంలో సూరత్ డైమండ్ బోర్స్, కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. రూ. 3400 కోట్లతో 35.54 ఎకరాల స్థలంలో నిర్మించిన సూరత్ డైమండ్ బోర్స్ పాలిష్ చేసిన వజ్రాల వ్యాపారానికి గ్లోబల్ హబ్‌గా మారనుంది.నిజానికి, సూరత్ డైమండ్ బోర్స్ అంతర్జాతీయ వజ్రాలు, ఆభరణాల వ్యాపారానికి ప్రపంచంలోనే అతిపెద్ద,ఆధునిక కేంద్రం అవుతుంది. ఇది కఠినమైన, మెరుగుపెట్టిన వజ్రాలతో పాటు ఆభరణాల వ్యాపారానికి ప్రపంచ కేంద్రంగా ఉంటుంది. ఎక్స్ఛేంజీలో దిగుమతి-ఎగుమతి కోసం అత్యాధునిక 'కస్టమ్స్ క్లియరెన్స్ హౌస్' ఉంది. ఇది జ్యువెలరీ మాల్, అంతర్జాతీయ బ్యాంకింగ్, రిటైల్ జ్యువెలరీ వ్యాపారం కోసం సురక్షితమైన వాల్ట్ సౌకర్యాన్ని కలిగి ఉంటుంది.

డైమండ్ బర్స్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటర్ కనెక్టడ్ భవనం అని చెప్పవచ్చు. రూ. 3,400కోట్ల వ్యయంతో 35.54 ఎకరాల్లో కొత్తగా నిర్మించిన డైమండ్ బర్స్, సూరత్, రఫ్ అండ్ పాలిష్డ్ డైమండ్ ట్రెడింగ్ కు ప్రపంచ కేంద్రంగా మారుతుంది. 1.5లక్షల మందికి ఇది ఉపాధిని కల్పిస్తుంది. ఇక దీని ఫీచర్స్ గురించి తెలుసుకుంటే...ఈ బర్స్ లో 4,500 కంటే ఎక్కువ ఆఫీసులు ఉన్నాయి. ఒకదానితో మరొకటి అనుసంధానించి ఉన్నాయి. ఇది 67,000మంది వ్యక్తులు, వ్యాపారవేత్తలు, సందర్శకులు పని చేసే కెపాసిటిని కలిగి ఉంది. భవన ప్రవేశాల దగ్గ హై సెక్యూరిటీ చెక్ పోస్టులు, పబ్లిక్ అనౌన్స్ మెంట్ సిస్టమ్స్ ఉన్నాయి. ఈ భవనంలో గ్రౌండ్ ప్లోర్ లో సభ్యుల కోసం బ్యాంక్, రెస్టారెంట్, డైమండ్ ల్యాబ్ మొదలైన సౌకర్యాలు ఎన్నో ఉన్నాయి.

ఇక ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే వజ్రాలకు ఇక్కన సాన పెడతారు. రఫ్, కట్, పాలిష్ చేసిన వజ్రాలు పొదిగిన ఆభరణాలు, వజ్రాలు బంగారం, వెండి, ప్లాటినం వంటి ఆభరణాలతో సహా అధిక విలువైన నగలను ఇక్కడ కొనడం, అమ్మడం జరుగుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద కార్పొరేట్ కార్యాలయం అయిన సూరత్ బర్స్ లో 67,00మంది వ్యక్తులు, వ్యాపారవేత్తలు, సందర్శకులు పనిచేసే సామర్థ్యం కూడా ఉంది. 67లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హై సెక్యూరిటీ చెక్ పోస్టులు, పబ్లిక్ అనౌన్స్ మెంట్ సిస్టమ్స్, 4500కంటే ఎక్కువ డైమండ్ ట్రేడింగ్ కార్యాలయాలు ఉన్నాయి.

బిల్డింగ్ యుటిలిటీ సేవలను పర్యవేక్షించేందుకు బిల్డింగ్ మేనేజ్ మెంట్ సిస్టమ్ కూడా ఉంటుంది. ప్రతి టవర్ ను ప్రతి అంతస్తుకు అనుసంధానించే నిర్మాణం వెన్నుముక లాంటిది. దిగుమతి, ఎగుమతి కోసం కస్టమ్స్ క్లియరెన్స్ హౌస్ సౌకర్యం కూడా ఉంది. వెన్నెముకలో 4 విభిన్న సురక్షిత వాల్ట్ ల సౌకర్యం, వెన్నెముక యొక్క సాధారణ మార్గాన్ని చల్లగా ఉంచేందుకు రేడియంట్ కూలింగ్ సిస్టమ్ , సభ్యులకోసం బ్యాక్ గ్రౌండ్ ఫ్లోర్, రెస్టారెంట్, డైమండ్ ల్యాబ్ వంటి సౌకర్యాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతిరెండు టవర్ల మధ్య 6వేల చదరపు మీటర్లు, గార్డెన్, యుటిలిటీ సేవల కోసం ప్రత్యేక భవనాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి అంతస్తులో తోటతో కూడిన కర్ణిక ఉంటుంది. అక్కత ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. 5 ప్రవేశ, 5 నిష్క్రమణ మార్గలు ఉన్నాయి. అంతేకాదు 7 పాదాచారుల గేట్లు ఉన్నాయి. ప్రతిటవర్ విలాసవంతమైన ప్రవేశ ఫోయర్, యాక్సెస్ కంట్రోల్ సిస్టమ్, టచ్ లెస్ కార్డ్ లెస్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇక్కడ హై సెక్యూరిటీ చెక్ పోస్టులను కూడా ఏర్పాటు చేశారు. ఈ భవనంలో గ్రౌండ్ ఫ్లోర్ లో సభ్యుల కోసం బ్యాంక్, రెస్టారెంట్, డైమండ్ ల్యాబ్ సౌకర్యాలు ఉన్నాయి.

ఇది కూడా చదవండి:  రాత్రిళ్లు ఎక్కువగా ఫోన్ చూస్తున్నారా? అయితే మీకు ఈ ఐదు వ్యాధులు గ్యారెంటీ..!!

Advertisment
తాజా కథనాలు