ఖమ్మంలో పొలిటికల్‌ హీట్.. తుమ్మల ఎటు వైపు..?

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అడుగులు ఎటు వైపు? ఖమ్మం జిల్లా పాలేరు నుంచి తనకే టికెట్‌ వస్తుందని భావించిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి కేసీఆర్‌ షాక్‌ ఇవ్వడంతో ఆయన అనుచరులు ఆగ్రహంగా ఉన్నారు. ఇటు కాంగ్రెస్‌, బీజేపీకి చెందిన రాజకీయ పెద్దలతో తుమ్మలకు మంచి సంబంధాలే ఉన్నాయి. భవిష్యత్‌ కార్యాచరణకు తుమ్మల ఇప్పటికే సిద్ధమయ్యారని తెలుస్తోంది.

New Update
ఖమ్మంలో పొలిటికల్‌ హీట్.. తుమ్మల ఎటు వైపు..?

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మౌనం వెనుక అనేక కారణాలు ఉన్నట్టు కనిపిస్తోంది. పాలేరు సీటును కందాల ఉపేందర్‌రెడ్డికే కేటాయించడంతో భవిష్యత్‌ కార్యాచరణకు తుమ్మల సిద్ధమైనట్టు సమాచారం. ఏది ఏమైనా పాలేరు బరిలో నిలవాలని తుమ్మల నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అభిప్రాయ సేకరణ జరపాలని డిసిషన్‌ తీసుకున్నట్టు సమాచారం. ఖమ్మం రూరల్‌లోని ఓ ఫంక్షన్ హాల్‌లో తుమ్మల ముఖ్య అనుచురలు సమావేశమయ్యారు. ప్రస్తుతం పంటి నొప్పితో హైదరాబాద్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు తుమ్మల. అభిప్రాయ సేకరణ తర్వాత హైదరాబాద్ వెళ్లి తుమ్మల నాగేశ్వరరావును ముఖ్య అనుచరులు కలవనున్నారు. తుమ్మల ప్రస్తుతం ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

ఏ గూటికి వెళ్తారో?
తుమ్మల రాజకీయ వారసత్వాన్ని, పలుకుబడిని దృష్టిలో ఉంచుకుని అన్ని రాజకీయ పార్టీలు ఆయన్ను తమ గూటికి ఆహ్వానించేందుకు ఎత్తుగడలు వేస్తున్నట్లు వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, జానారెడ్డి తదితరులకు తుమ్మల అత్యంత సన్నిహితుడు. ఆయన్ను ఆహ్వానించేందుకు ఇరు పార్టీలు సిద్ధంగా ఉందన్న ప్రచారం జరుగుతోంది. అటు బీజేపీ కూడా తుమ్మల అడుగులను నిశీతంగా గమనిస్తోంది.

తుమ్మలకు బీజేపీ నేతలతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయన సమీప బంధువు, రాజ్యసభ మాజీ ఎంపీ గరికపాటి మోహన్ రావు ఖమ్మం జిల్లా రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక కాంగ్రెస్‌ నుంచి గెలిచి బీఆర్‌ఎస్‌లోకి మారిన కందాల ఉపేందర్‌రెడ్డికి బీఆర్‌ఎస్‌ టికెట్‌ ఇవ్వడంపై తుమ్మల వర్గీయులు మండిపడుతున్నారు. ఈ పరిణామాల మధ్యనే హైదరాబాద్‌లోని తన నివాసంలో తుమ్మల తన అనుచరులతో ముచ్చటించారు. కేసీఆర్‌ ఇచ్చే భరోసాతో తుమ్మల నిర్ణయం ముడిపడే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. తనకు కొత్తగూడెం అభ్యర్థిత్వం దక్కుతుందని మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు ధీమా వ్యక్తం చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు