President's Rule: తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధిస్తారా..? బీఆర్ఎస్ నేతల మాటల మర్మం ఏమిటి..?

కొద్ది రోజులుగా దేశంలో జమిలీ ఎన్నికలపై జోరుగా చర్చ జరుగుతోంది. ఈనెల 18 నుంచి ఐదు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనుండడంతో వన్ నేషన్- వన్ ఎలక్షన్ మరోసారి తెరపైకి వచ్చింది. ఈ క్రమంలోనే మంగళవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఎన్నికలు గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి.

President's Rule: తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధిస్తారా..? బీఆర్ఎస్ నేతల మాటల మర్మం ఏమిటి..?
New Update

Will President's rule imposed in Telangana?: కొద్ది రోజులుగా దేశంలో జమిలీ ఎన్నికలపై జోరుగా చర్చ జరుగుతోంది. ఈనెల 18 నుంచి ఐదు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనుండడంతో వన్ నేషన్- వన్ ఎలక్షన్ మరోసారి తెరపైకి వచ్చింది. ఈ క్రమంలోనే మంగళవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (Minister KTR) ఎన్నికలు గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు ఆలస్యం కావొచ్చని.. లోక్‌సభ ఎన్నికలతో పాటు ఏప్రిల్, మే నెలలో ఎన్నికలు జరిగినా ఆశ్చర్యం లేదంటూ వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి.

డైలమాలో బీఆర్ఎస్ నేతలు..

"అక్టోబర్ 10లోపు నోటిఫికేషన్ వస్తేనే తెలంగాణలో ఎన్నికలు వస్తాయి. కానీ అక్టోబర్‌లో నోటిఫికేషన్ రావడం అనుమానమే.. తెలంగాణలో ఎన్నికలు ఏప్రిల్, మే నెలల్లో జరగొచ్చు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఈ అంశంపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా రాష్ట్రంలో 90 స్థానాలకు పైగా గెలుస్తాం." అంటూ కేటీఆర్ చెప్పినట్లు మీడియాలో వచ్చింది. అయితే ఈ వ్యాఖ్యలపై స్పందించిన కేటీఆర్ తాను అలా అనలేదని క్లారిటీ ఇచ్చారు. అయితే కేటీఆర్ ఎన్నికలు గురించి అన్నారో లేదో పక్కనపెడితే మాత్రం కేంద్రం మినీ జమిలి ఎన్నికలకు సిద్ధం అయింది. దీంతో బీఆర్ఎస్ నేతలు డైలమాలో పడ్డట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

ఎన్నికలపై కేంద్రం కుట్రలు చేస్తోంది..

తాజాగా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ వ్యాఖ్యలు కూడా ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. మినీ జమిలి ఎన్నికలు జరిపేలా కూడా కేంద్రం కుట్రలు చేస్తోందన్నారు. కేంద్రం ప్రభుత్వం రాజకీయ పార్టీలను గందరగోళంలోకి నెట్టిందని మండిపడ్డారు. న్యూసెన్స్ చేస్తూ కేంద్రం గట్టు ఎక్కాలనే దూరలోచన చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ని మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. BRSని గెలిపించాలని కోరారు.

Also Read: మినీ జమిలి ఎన్నికలు జరిపేలా కూడా కేంద్రం కుట్రలు: గుత్తా సుఖేందర్‌రెడ్డి

రాష్ట్రపతి పాలన విధిస్తారా..?

మినీ జమిలీ ఎన్నికల కోసం రాజ్యాంగ సవరణ చేస్తే.. తెలంగాణ ఎన్నికలు మేలో జరుగుతాయి. అయితే తెలంగాణ అసెంబ్లీ ప్రస్తుత పదవీ కాలం జనవరి 17 లోపు ముగిసిపోతుంది. మరి ఒకవేళ మేలో ఎన్నికలు నిర్వహిస్తే అప్పటివరకు రాష్ట్రాన్ని ఎవరు పాలిస్తారు. అంటే రాజ్యాంగంలో సవరణ చేసి ఆరు నెలలు పొడిగిస్తే బీఆర్‌ఎస్ ప్రభుత్వమే అప్పటి వరకు పాలిస్తుంది. కానీ ఇది సాధ్యమైనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఐదు సంవత్సరాల కాలానికి మాత్రమే ప్రజలు ఓట్లు వేసి గెలిపించారు కాబట్టి ఆ గడువుకు మించి పాలన చేయడం సాధ్యం కాదంటున్నారు. మరి అప్పుడు ఏం చేయాలంటే కచ్చితంగా రాష్ట్రపతి పాలన విధించాల్సిందే.

రాష్ట్రపతి పాలనకు ఒప్పుకునే ప్రసక్తే లేదు..

సాధారణంగా శాంతి భద్రతల సమస్య తలెత్తినప్పుడో.. సంక్షోభ పరిస్థితుల్లోనో రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధిస్తారు. గతంలో ఏపీ విభజన సమయంలో రాష్ట్రపతి పాలన విధించారు. ఇప్పుడు జమిలీ ఎన్నికల కోసం డిసెంబరులో ఎన్నికలు జరగాల్సిన ఐదు రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించడమే కేంద్రానికి తేలికైన పని అని భావిస్తున్నారు. ప్రెసిడెంట్ రూల్ పెడితే కేంద్రం చేతిలో మొత్తం పాలన ఉంటుంది. తెలంగాణ, చత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో బీజేపీయేతర ప్రభుత్వాలే ఉన్నారు. దీంతో ఇది తమకు కలిసివస్తుందని బీజేపీ పెద్దలు భావిస్తున్నారట. మరోవైపు బీఆర్ఎస్ నేతలు మాత్రం మినీ జమిలీ ఎన్నికలను తీవ్రంగా ఖండిస్తున్నారు. రాష్ట్రపతి పాలనకు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రపతి పాలన పెడితే కేసీఆర్ సీఎంగా ఉండరని.. దీంతో బీఆర్ఎస్ పార్టీకి నష్టం జరిగే అవకాశముందని వెల్లడిస్తున్నారు.

మినీ జమిలీ ఎన్నికలైనా నిర్వహించాలని కేంద్రం ప్లాన్..

ఇటు జమిలీ ఎన్నికల సాధ్యసాధ్యాలపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కమిటీ వేసిన సంగతి తెలిసిందే. పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో కమిటీ ఇచ్చే నివేదికను సభలో పెట్టనున్నట్లు తెలుస్తోంది. అనంతరం ఆ బిల్లును ఆమోదించే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి తెలంగాణ, మిజోరం, చత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. 2024లో ఆంధ్రప్రదేశ్, సిక్కిం, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్ సహా 12 రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎలక్షన్స్ జరగాలి. దీంతో ప్రస్తుతానికి జమిలి ఎన్నికలు నిర్వహణ కష్టం కాబట్టి మినీ జమిలీ ఎన్నికలు అయినా నిర్వహించాలని కేంద్రం యోచిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: ఖమ్మం కాంగ్రెస్‌లో మూడు స్తంభాలాట.. ఇలా అయితే ఎలా..?

#will-presidents-rule-be-imposed-in-telangana #presidents-rule-will-be-imposed-in-telangana #brs-party #presidents-rule-in-telangana
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe