PMMVY: గర్భిణీలకు రూ.6 వేలు అందించే పథకం.. ఈ స్కీమ్‌కు ఇలా అప్లై చేసుకోండి!

గర్భిణీల కోసం కేంద్ర ప్రభుత్వం ఓ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ స్కీమ్‌ పేరు 'ప్రధానమంత్రి మాతృ వందన యోజన'. చాలామందికి ఈ పథకంపై అవగాహన లేదు. 19ఏళ్లు దాటిన పేద గర్భిణీలు ఈ పథకానికి అర్హులు. ఈ పథకం కింద గర్భిణీలకు రూ.6,000 ఆర్థిక సాయం అందిస్తారు.

New Update
PMMVY: గర్భిణీలకు రూ.6 వేలు అందించే పథకం.. ఈ స్కీమ్‌కు ఇలా అప్లై చేసుకోండి!

దేశంలో ప్రజలకు చేయుతనిచ్చే ఎన్నో రకాల ప్రయోజనకరమైన సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. వీటిలో కేంద్ర ప్రభుత్వం అందించే స్కీమ్‌లతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలు కూడా ఉన్నాయి. సమాజంలోని దాదాపు ప్రతి వర్గానికి ఈ పథకాల ప్రయోజనాలను అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తుంటాయి. కొన్ని పథకాలలో వస్తువులు ఇస్తుంటారు. కొన్ని స్కీమ్స్‌లో ల్యాండ్స్‌ లేదా ఇల్లు లాంటివి ఇస్తుంటారు. మరికొన్ని స్కీముల్లో నేరుగా ఆర్థిక సాయం అందిస్తారు. ఈ లిస్ట్‌లోనే ప్రధాన మంత్రి మాతృ వందన యోజన ఉంది. మహిళలకు సాధికారత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఇందులో గర్భిణీలకు రూ.6,000 ఆర్థిక సహాయం అందిస్తారు.

publive-image ప్రతీకాత్మక చిత్రం

పథకం గురించి కీలక వివరాలు:

  • పథకం పేరు - ప్రధాన మంత్రి మాతృ వందన యోజన
  • ఇది ఎవరి పథకం ?- భారత ప్రభుత్వం
  • ప్రయోజనం ఎంత ? - రూ.6 వేలు ఆర్థిక సహాయం
  • ఎవరు అర్హులు ?- గర్భిణీలు
  • ఎందుకీ పథకం ? - పోషకాహార లోపంతో పిల్లలు పుట్టే సమస్యను దృష్టిలో ఉంచుకుని ఈ పథకాన్ని ప్రారంభించారు.

ఇలా చేయండి:

  • మీరు కూడా గర్భవతి లేదా గర్భవతి కాబోతున్నట్లయితే .. ఈ స్కీమ్‌లో చేరవచ్చు..
  • ముందుగా మీరు ఈ పథకానికి చెందిన అధికారిక వెబ్‌సైట్ wcd.nic.in/schemes/pradhan-mantri-matru-vandana-yojana ని విజిట్ చేయాలి.
  • ఇది కాకుండా, మీరు మీ సమీపంలోని అంగన్‌వాడీకి కూడా వెళ్లవచ్చు.

అర్హులైన మహిళలు ఎవరు?
ప్రధాన మంత్రి మాతృ వందన యోజనలో చేరాలనుకుంటే ముందుగా మీరు అర్హులో కాదో తెలుసుకోవాలి. 19ఏళ్లు దాటిన గర్భిణీలు, పేద తరగతి వారు ఈ పథకానికి అర్హులు.

Also Read: అమెరికా చరిత్రంతా హత్యలు, హత్యాయత్నాలే.. లింకన్‌ నుంచి ట్రంప్‌ వరకు.. !

Advertisment
తాజా కథనాలు