Education: పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సును (Post Graduation) ఇప్పటి దాకా రెండేళ్లు చదవాల్సి ఉండేది. అయితే, ఇక నుంచి ఏడాదిలోనే దాన్ని పూర్తి చేసే అవకాశం కల్పించేందుకు యూజీసీ (UGC) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీ (Degree) పూర్తి చేసిన వారు దానికి అర్హులు. ఇప్పటికే ఇందుకు రంగం సిద్ధం చేసిన యూజీసీ త్వరలో ఆ కోర్సులను అందుబాటులోకి తీసుకురానుంది. విద్యా ప్రణాళిక, క్రెడిట్ ఫ్రేమ్‌వర్క్ సంబంధిత మార్గదర్శకాల ముసాయిదాను ఇటీవలే విడుదల చేసిన యూజీసీ దానిపై డిసెంబరు 15 వరకూ అభ్యంతరాలు, సూచనలను స్వీకరించాలని నిర్ణయించింది. అభ్యంతరాల పరిశీలన అనంతరం డిసెంబరు లేదా జనవరిలో అంతిమ మార్గదర్శకాలు విడుదలవుతాయి. జాతీయ విద్యా విధానం 2020కి అనుగుణంగా పీజీ విద్యలో మార్పులకు యూజీసీ శ్రీకారం చుట్టింది.
ఇది కూడా చదవండి: Jobs: డిగ్రీ అర్హతతో… ఈ ప్రభుత్వ సంస్థలో భారీ రిక్రూట్మెంట్..వెంటనే అప్లయ్ చేసుకోండి..!!
ప్రతిపాదనలివే..
- మూడేళ్ల డిగ్రీ పూర్తిచేస్తే ఎప్పట్లాగే రెండేళ్ల పీజీ చదవాల్సి ఉంటుంది. నాలుగేళ్ల ఆనర్స్ పూర్తిచేస్తేనే ఒక్క ఏడాదిలో పీజీ చదివే వెసులుబాటు ఉంటుంది. డిగ్రీలో చదివిన సబ్జెక్టుల్లో ఏదైనా ఒక దాంట్లో పీజీ పూర్తి చేయొచ్చు.
- మూడేళ్ల డిగ్రీ చదివిన విద్యార్థులు రెండేళ్ల పీజీలో చివరి ఏడాదిని రీసెర్చికే పూర్తిగా కేటాయించాలి. ఫస్టియర్ తోనే పీజీ చదవడం మానేస్తే పీజీ డిప్లొమా పట్టా అందుతుంది. తర్వాత ఆసక్తి ఉన్నప్పుడు సెకండియర్ కూడా పూర్తి చేస్తే పీజీ పట్టా వస్తుంది.
- ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ విధానాల్లో దేనినైనా ఎంపిక చేసుకునే అవకాశం విద్యార్థులకు ఉంది.
- మరికొన్ని ఐదు సంవత్సరాల సమీకృత కోర్సులను (Course) అందుబాటులోకి తేవడానికి కూడా ఆలోచన చేస్తున్నారు. కృత్రిమ అభ్యసనం (ఆర్టిఫిషియల్ లెర్నింగ్)తో అనుసంధితంగా ఆరోగ్య రక్షణ, వ్యవసాయం, న్యాయ విద్య వంటి కోర్సులను ప్రవేశపెట్టుకునేందుకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు.
ఇది కూడా చదవండి: సీ-ఓటర్ ఒపీనియన్ పోల్ సంచలన లెక్కలివే!