Big Breaking: కాంగ్రెస్ కు పొన్నాల లక్ష్మయ్య రాజీనామా.. ఆ పార్టీలో చేరే ఛాన్స్?

కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ పీసీసీ చీఫ్, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పార్టీకి రాజీనామా చేశారు.

Big Breaking: కాంగ్రెస్ కు పొన్నాల లక్ష్మయ్య రాజీనామా.. ఆ పార్టీలో చేరే ఛాన్స్?
New Update

Ponnala Laxmaiah Resigns To Congress: అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ (Telangana Congress) పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ పీసీసీ చీఫ్, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ (Ponnala Laxmaiah) పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఏఐసీసీ చీఫ్ మల్లిఖర్జున ఖర్గేకు ఆయన లేఖ రాశారు. కాంగ్రెస్ లో బీసీలకు అన్యాయం జరుగుతోందని ఆయన తన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. 2014 ఎన్నికల్లో ఓటమికి తనను బాధ్యుడిని చేసి తొలగించారన్నారు. నాటి నుంచి నేటి వరకు వివిధ సమస్యలపై తాను పోరాటం చేస్తునే ఉన్నానన్నారు. అయితే.. ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న పరిణామాలు తనను బాధిస్తున్నాయని లేఖలో పేర్కొన్నారు. జనగామ అసెంబ్లీ సీటును పొన్నాలకు కాకుండా కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి ఇవ్వనున్నట్లు ప్రచారం సాగుతున్న నేపథ్యంలోనే ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: గెలిచేది కాంగ్రెస్ పార్టీనే.. నాకూ సీఎం అయ్యే ఛాన్స్ ఉంది: కోమటిరెడ్డి

గత ఎన్నికల సమయంలో జనగామ సీటును పొత్తుల్లో భాగంగా టీజేఎస్ నుంచి కోదండరామ్ పోటీకి సిద్ధమయ్యారు. ఓ దశలో ఆయన పోటీకి కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఓకే చెప్పిందన్న ప్రచారం సాగింది. మాజీ పీసీసీ చీఫ్, బీసీ నేత అయిన పొన్నాలకు టికెట్ ఇవ్వకపోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న ఆలోచనతో ఆఖరి నిమిషంలో వెనక్కి తగ్గింది కాంగ్రెస్. దీంతో ఆ ఎన్నికల్లో పొన్నాల పోటీ చేశారు.

తాజాగా.. మరో సారి టికెట్ కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి రావడంతో పొన్నాల తీవ్ర అసహనానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీకి రాజీనామా చేసినట్లు సమాచారం. అయితే.. కాంగ్రెస్ కు పొన్నాల రాజీనామా చేయడంతో ఆయన ఏ పార్టీలో చేరుతారన్నది చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ లో చేరుతారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఒకటి, రెండు రోజుల్లో పొన్నాల ఈ అంశంపై అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

#ponnala-laxmaiah
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe