Narsipatnam: అయ్యన్నకు బిగ్ షాక్.. తమ్ముడిని బరిలోకి దింపుతున్న వైసీపీ..?

నర్సీపట్నంలో టీడీపీకి చెక్ పెట్టేందుకు వ్యూహానికి పదునుపెట్టింది అధికార పార్టీ వైసీపీ. అన్న అయ్యన్నపై పోటీకి తమ్ముడు చింతకాయల సన్యాసిపాత్రుడిని రంగంలోకి దింపనున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే ఉమా శంకర్ ను పక్కన పెట్టి సన్యాసిపాత్రుడిని అభ్యర్థిగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.

Narsipatnam: అయ్యన్నకు బిగ్ షాక్.. తమ్ముడిని బరిలోకి దింపుతున్న వైసీపీ..?
New Update

Narsipatnam: ఏపీలో ఎన్నికలు దగ్గరలో ఉండడంతో అధికార పార్టీ వైసీపీ టికెట్లను ఎవరికి ఇవ్వాలి అన్న దాని మీద తీవ్ర కసరత్తు చేస్తోన్న సంగతి తెలిసింది. రాజకీయ నేతలు తమ వలసలను పెంచుకోవడంతో పాటు ప్రత్యర్థిని బలహీన పరచడానికి ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీకి చెక్ పెట్టేందుకు అధికార పార్టీ వైసీపీ వ్యూహానికి పదునుపెట్టింది. టీడీపీ సీనియర్ నేత అన్న అయ్యన్న పాత్రుడి(TDP Ayyanna Patrudu)పై పోటీకి తమ్ముడు సన్యాసిపాత్రుడి(YCP Sanyasi Patrudu)ని రంగంలోకి దింపనున్నట్లు తెలుస్తోంది.

Also Read: ‘మీ కాళ్లు పట్టుకోవాలా’.. సొంత పార్టీ నేతలపై వైసీపీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్..!

అన్నదమ్ముల పొలిటికల్ వార్

ఈ నేపధ్యంలో అన్నదమ్ముల పొలిటికల్ వార్ కు వేదిక కానుంది నర్సీపట్నం(Narsipatnam). 2019 ఎన్నికల అనంతరం వైసీపీలో చేరారు అయ్యన్న సోదరుడు చింతకాయల సన్యాసిపాత్రుడు. వచ్చే ఎన్నికల్లో అయ్యన్నను ఎదుర్కునేందుకు సన్యాసిపాతృడే బలమైన అభ్యర్థిగా బావించిన జగన్..సిట్టింగ్ ఎమ్మెల్యే ఉమా శంకర గణేష్ ను పక్కన పెట్టాలని బావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇంచార్జి గా సన్యాసిపాత్రుడి?

మూడో విడత జాబితాలో నర్సీపట్నం అసెంబ్లీ సెగ్మెంట్ ఇంచార్జి గా సన్యాసిపాత్రుడిని ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. టీడీపీ నేత అయ్యన్నకు తమ్ముడు  సన్యాసిపాత్రుడు అయితేనే గట్టి పొటి అని అధిష్టానం భావిస్తుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే గణేష్ కు సౌమ్యుడిగా పేరు ఉన్నప్పట్టికి అయ్యన్నకు మాటకు మాట సమధానం చెప్పే కెపాసిటీ సన్యాసిపాత్రుడికి ఉందని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. గతంలో సన్యాసిపాత్రుడి భార్యకి డీసీసీబీ చైర్మన్ పదవి ఇచ్చింది వైసీపీ ప్రభుత్వం.

ఎమ్మెల్యే పరిస్థితి ఏంటి?

ఎమ్మెల్యే గణేష్ టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ స్వయనా తమ్ముడు. 2019 ఎన్నికల్లో టీడీపీ సీనియర్ నేత అయ్యన్నను ఓడించి ఎమ్మెల్యేగా గెలిచారు. మరి అలాంటి వ్యక్తిని ఇప్పుడు పక్కన పెట్టడం ప్రభుత్వానికి ప్లస్ అవుతుందా? లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎమ్మెల్యే గణేష్ ఇందుకు ఒప్పుకుంటారా? అనేది కూడా తేలాల్సి ఉంది. మరోవైపు ఎలాగైనా సిట్టింగ్ ఎమ్మెల్యే కు నచ్చ జెప్పి సన్యాసిపాత్రుడికి టికెట్ ఇచ్చే ప్లాన్ చేస్తున్నారు వైసీపీ పెద్దలు. చూడాలి మరి..టికెట్ అయ్యన్న తమ్ముడికి ఇస్తారా? లేదంటే నిర్ణయం మార్చుకుంటారా అనేది క్లారిటీ రావాలి.

చెత్త ఎక్కడున్నా చెత్తే: అయ్యన్న

ఇదిలా ఉండగా.. Rtv తో మాజీ మంత్రి అయ్యన్న మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంపై హాట్ కామెంట్స్ చేశారు. జగన్ బలవంతంగా అభ్యర్థులను మార్చుతున్నాడని.. చెత్త ఎక్కడున్నా చెత్తే అని విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే షర్మిల కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం ఉందని తెలిపారు. ఆమె వలన టీడీపీకి లాభం వైసీపీకి నష్టం అంటూ వ్యాఖ్యనించారు.10 శాతం ఓట్లు చీలీనా వైసీపీ భూస్తాపితం అవుతుందని షాకింగ్ కామెంట్స్ చేశారు.

#ayyanna-patrudu #sanyasi-patrudu
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe