Pithapuram: ఈసీ స్పెషల్ ఫోకస్.. ఈ జిల్లాలో పెట్రోల్ బంకులపై ఆరోజు వరకు ఆంక్షలు.!

పిఠాపురం, కాకినాడ నియోజకవర్గాల్లో కేంద్రం ప్రత్యేక నిఘా పెట్టింది. పోలింగ్ తర్వాత పలు నియోజకవర్గాల్లో జరిగిన హింసాత్మక ఘటనలను దృష్టిలో పెట్టుకుని కౌంటింగ్ ప్రక్రియపై ఎన్నికల కమిషన్ స్పెషల్ ఫోకస్ ఉంచింది. ఈ నియోజకవర్గాల్లో కేంద్ర బలగాలతో పహారాకు నిర్ణయించింది.

New Update
Pithapuram: ఈసీ స్పెషల్ ఫోకస్.. ఈ జిల్లాలో పెట్రోల్ బంకులపై ఆరోజు వరకు ఆంక్షలు.!

Pithapuram Politics : పిఠాపురం నియోజకవర్గంపై కేంద్రం ప్రత్యేక నిఘా పెట్టింది. కాకినాడ నగర నియోజకవర్గంపైనా డేగ కన్ను వేసింది. పోలింగ్ తర్వాత పలు నియోజకవర్గాల్లో జరిగిన హింసాత్మక ఘటనలను దృష్టిలో పెట్టుకుని కౌంటింగ్ ప్రక్రియపై ఎన్నికల కమిషన్ స్పెషల్ ఫోకస్ చేసింది. హింసాత్మక ఘటనలు జరిగే నియోజకవర్గాల్లో గొడవలకు దిగే వ్యక్తులను గుర్తించి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

Also Read: బెంగళూరులో రేవ్ పార్టీ.. భారీగా డ్రగ్స్.. నటి హేమ కూడా..? 

ఈసీ ఆదేశాలతో రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం నివేదిక ఇచ్చింది. పిఠాపురం, కాకినాడ నగరం నియోజకవర్గాల్లో కౌంటింగ్‌కు 3 రోజుల ముందు, తర్వాత 4 రోజులు హింసాత్మక ఘటనలు జరిగే ఆస్కారం ఉందని హెచ్చరించింది. ఇంటెలిజెన్స్ నివేదికతో అప్రమత్తమైన ఎన్నికల సంఘం కౌంటింగ్‌కు రెండు రోజుల ముందే ఈ నియోజకవర్గాల్లో కేంద్ర బలగాలతో పహారాకు నిర్ణయించింది.


Also Read: ఆ ఒక్క విషయంలో ఎన్టీఆర్ వరల్డ్ లోనే నంబర్ వన్!

పిఠాపురం, కాకినాడ సిటీలో గొడవలకు ప్రేరేపించే సుమారు 20 మంది గుర్తింపు అనుమానితుల కదలికలపై ఇంటెలిజెన్స్ నిఘా పెట్టింది. తూర్పు గోదావరి జిల్లాలో పెట్రోల్ బంకులపై జూన్ 10 వరకు ఆంక్షలు విధించింది. కంటైనర్లు, బాటిళ్లు, డ్రమ్ముల్లో పెట్రోల్, డీజిల్ అమ్మొద్దని ఆదేశాలు ఇచ్చింది.

Advertisment
తాజా కథనాలు