Pimples Tips: ఈ బిజీ లైఫ్‌లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక దాని గురించి ఆందోళన చెందుతారు. అధిక ఒత్తిడి ఆరోగ్యంతో పాటు చర్మానికి కూడా ప్రమాదకరమని నిపుణులు అంటున్నారు. ఒత్తిడి, ఆందోళన కారణంగా ముఖంపై మొటిమలు, నల్లటి వలయాల సమస్యలు వస్తాయని చర్మ నిపుణులు చెబుతన్నారు. ఒత్తిడికి గురైనప్పుడల్లా లేదా ఏదైనా విషయం గురించి ఆందోళన చెందుతున్నప్పుడు దినచర్య పూర్తిగా మారిపోతుంది. ఆ సమయంలో వ్యక్తి సరిగ్గా నిద్రపోలేడు, జీర్ణ సమస్యలను కలిగి ఉంటాడు. దీని కారణంగా.. చర్మంపై మొటిమలు వస్తాయి. మితిమీరిన ఆందోళన కారణంగా ముఖంపై మాత్రమే కాకుండా, భుజాలు, నడుముపై కూడా మొటిమలు కనిపిస్తుంటాయి.
అదనపు ఒత్తిడి:
అధిక ఒత్తిడి వల్ల ముఖం మీద దురద, మచ్చలు ఏర్పడతాయి. అంతేకాకుండా ఎరుపు, వాపు వచ్చే అవకాశం కూడా పెరుగుతుంది. ఒత్తిడి ఆండ్రోజెన్, కార్టిసాల్ వంటి హార్మోన్లను విడుదల చేస్తుంది. ఇది చమురు ఉత్పత్తిని పెంచుతుంది. ఒత్తిడి రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. ఇది బ్యాక్టీరియాతో పోరాడటం కష్టతరం అయి మొటిమలకు దారితీస్తుంది. కొన్నిసార్లు అధిక ఒత్తిడి అశాంతిని కలిగిస్తుంది. ఆ సమయంలో నిరంతర చెమటలు, చెమట కారణంగా.. ముఖం మీద మొటిమలు కూడా వస్తాయి. ఈ మొటిమల నుంచి ఉపశమనం పొందాలంటే కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఈ విషయాలపై ప్రత్కేక శద్ధ:
మొదటిలు తగ్గాలంటే ఒత్తిడికి దూరంగా ఉండాలి. తగినంత నిద్ర పొందాలి. ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. మొటిమలకు అనేక ఇతర కారణాలు ఉండవచ్చని గుర్తుంచుకొవాలి. అందువల్ల.. రోజుకు రెండు మూడు సార్లు చల్లటి నీటితో ముఖాన్ని కడుకోని, చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మొటిమల విషయంలో..పెరుగు, పసుపు, శెనగపిండి వంటి కొన్ని ఇంటి నివారణలను కూడా ప్రయత్నించవచ్చు. ఈ పనులు చేసినా మొటిమల నుంచి ఉపశమనం లభించకపోతే, ఒత్తిడికి గురికావడం, ఆందోళన చెందడం మానేయాలి. ఇంకా ఏమైనా ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: విడాకులు కావాలా.. అయితే ఆ గుడికి వెళ్లండి
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణులని సంప్రదించడం ఉత్తమం.