ఈ స్క్రబ్స్‌తో పిగ్మంటేషన్ కు చెక్! ముఖం పైన ఉన్న పిగ్మంటేషన్ ను పోగొట్టటానికి ఇంట్లో దొరికే వాటిని ఉపయోగించవచ్చని నిపుణులు అంటున్నారు. బయట దొరికే కెమికల్స్ కన్నా నారింజ ,నిమ్మ, పసుపు ,శనగపిండి వాటిలో కొన్ని పదార్థాలను వినియోగించి వాడితే మంచి లాభం ఉంటుందని వారంటున్నారు. అవేంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. By Durga Rao 21 Jul 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి నిమ్మ,నారింజ తొక్కలు విటమిన్ సి గుణం కలిగి ఉంటాయి. ఈ పండ్లు తొక్కల్ని బాగా ఆరబెట్టి మిక్సీ పట్టండి. తర్వాత ఇందులో రోజ్ వాటర్ వేయండి. దీనిని ముఖానికి అప్లై చేసి కాసేపటి తర్వాత మెల్లిగా మసాజ్ చేయండి. మృతకణాలు తొలగించేందుకు ఓట్స్ చాల చాలా బాగా పనిచేస్తాయి. అంతేకాకుండా, ఓట్స్‌ని వాడడం వల్ల టానింగ్, డార్క్ స్పాట్స్ తగ్గుతాయి. దీని వల్ల రక్తప్రసరణ పెరుగుతుంది. చర్మం మెరుస్తుంది. పాలలో కొద్దిగా ఓట్స్‌ని నానబెట్టండి. ఓట్స్ కాస్తా మొత్తగా అయ్యాక దీనిని తీసుకుని ముఖానికి స్క్రబ్ చేయండి. ఇందులోని పాలు పిగ్మంటేషన్‌ని దూరం చేస్తుంది.కాఫీ, కొబ్బరినూనె రెండు కూడా చర్మంపై మ్యాజిక్ చేస్తాయి. కాఫీలో రక్తప్రసరణని పెంచి బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్‌ని తొలగించే గుణాలు ఉన్నాయి. కొబ్బరినూనె చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది. చర్మ సమస్యల్ని దూరం చేస్తుంది. దీనికోసం కాఫీ పొడి, నూనెని కలిపి పేస్టులా చేసి సర్కిల్ మోషన్‌లో తిప్పండి. మెల్లిగా మసాజ్ చేసి తర్వాత క్లీన్ చేసుకోండి. శనగపిండి మంచి ఎక్స్‌ఫోలియంట్‌లా పనిచేస్తుంది. దీంతో స్క్రబ్ చేస్తే మృత కణాలు తొలిగి చర్మం కాంతివంతంగా మారుతుంది. దీని వల్ల చర్మ సమస్యలన్నీ దాదాపు దూరమవుతాయి. ఓ గిన్నెలో కాస్తా శనగపిండి, పసుపు వేసి వాటిని పాలు, రోజ్‌వాటర్‌తో కలపండి. దీనిని ముఖానికి అప్లై చేసి 10 నిమిషాల తర్వాత కొద్దికొద్దిగా నీటిని స్ప్రే చేస్తూ స్క్రబ్ చేయండి. ఇలా చేయడం వల్ల మృదువైన, మెరిసే చర్మం మీ సొంతమవుతుంది. #pigmentation మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి