Pfizer whistleblower: ఆత్మహత్య చేసుకోను.. కానీ, నాకేదైనా జరిగితే కంపెనీదే బాధ్యత.. ఫైజర్ ఉద్యోగిని సంచలనం 

తాను ఆత్మహత్య చేసుకోబోననీ.. కానీ, తనకేదైనా జరిగితే దానికి కంపెనీ, ప్రభుత్వం బాధ్యత వహించాలని ఫార్మా దిగ్గజం ఫైజర్ కంపెనీ విజిల్‌బ్లోయర్ మెలిస్సా మెక్‌టీ చేసిన X పోస్ట్ సంచలనం సృష్టిస్తోంది. ఆ వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు

Pfizer whistleblower: ఆత్మహత్య చేసుకోను.. కానీ, నాకేదైనా జరిగితే కంపెనీదే బాధ్యత.. ఫైజర్ ఉద్యోగిని సంచలనం 
New Update

ఫార్మా దిగ్గజం ఫైజర్ విజిల్‌బ్లోయర్(Pfizer whistleblower) ల మరణం తరువాత చిక్కుల్లో పడినట్టు కనిపిస్తోంది. ఫైజర్ కంపెనీ విజిల్‌బ్లోయర్ జాషువా డీన్ కంపెనీకి సంబంధించిన 737 మ్యాక్స్‌తో తయారీ లోపాల గురించి హెచ్చరించారు. ఆ తరువాత గత వారం ఆయన మరణించాడు. ఈ సంవత్సరం మరణించిన రెండో కంపెనీ విజిల్‌బ్లోయర్ ఇతను. ఈ నేపథ్యంలో తాజాగా మరో విజిల్‌బ్లోయర్ మెలిస్సా మెక్‌టీ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ Xలో చేసిన పోస్ట్ సంచలనం అవుతోంది. ఈమె  MRNA వ్యాక్సిన్ ల్యాబ్ టెస్టింగ్‌లో మానవ పిండం కణజాలాల నుండి పొందిన సెల్ లైన్ల వినియోగం గురించిన క్లెయిమ్స్..  సహా కంపెనీ నుండి ఇమెయిల్‌లను లీక్ చేసినట్టు 2021లో ప్రాజెక్ట్ వెరిటాస్ ద్వారా హైలైట్ అయింది. 

Pfizer whistleblower: ఇప్పుడు తన ట్వీట్ లో మెలిస్సా మెక్‌టీ తాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మహత్య చేసుకోను అని చెప్పింది. తనకు ఏదైనా హాని జరిగితే దానికి ప్రభుత్వం, బిగ్ ఫార్మా కారణం అవుతాయని ఆమె తన వీడియో పోస్టులో పేర్కొంది. ఆమె చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇది ఫైజర్ కంపెనీకి కొత్త చిక్కులు తెచ్చిపెట్టేలా కనిపిస్తోంది. 

Also Read: X లో బాట్ సమస్యకు పరిష్కారం తెచ్చిన ఎలోన్ మస్క్

Pfizer whistleblower: మెలిస్సా మెక్‌టీ తన వీడియో పోస్ట్ లో "నేను ఫైజర్ విజిల్‌బ్లోయర్‌ని, వాస్తవానికి దీర్ఘకాల ఫైజర్ ఉద్యోగిగా ఉద్యోగం చేస్తున్న ఏకైక వ్యక్తిని. నేను అలసిపోయాను. నన్ను ఒక మోసగత్తెగా భావించడాన్ని చూసి అలసిపోయాను. నాకు ఎటువంటి ఆశ లేదు.  నేను విసిగిపోయాను. నేను ఈ పోరాటంలో అలసిపోయాను. చర్చించడం, పోస్ట్ చేయడం, పరిశోధించడం వంటివి నా వద్ద లేవు’’ అని పేర్కొంది. అంతేకాకుండా, "నేను భయంతో జీవించడానికి నిరాకరిస్తున్నాను. కానీ ఏదైనా జరిగితే నాకు ఏమి జరిగిందో ప్రపంచం తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను" అని ఆమె X లో రాసింది.

Pfizer whistleblower: నిజానికి.. మెక్‌టీ వ్యాక్సిన్‌ల భాగాలు-గాయాలు -మరణాలకు వాటి మధ్య ఉన్నలింక్‌ల గురించి ఆందోళన వ్యక్తం చేసింది. అయితే, దీనికి వ్యతిరేకంగా Pfizer సీనియర్ డైరెక్టర్ వెనెస్సా గెల్‌మాన్ నుంచి ఒక ఈమెయిల్ అందుకున్నారు. దాని ప్రకారం వ్యాక్సిన్‌లలో గర్భస్రావం చేయబడిన పిండం కణాల సమస్యను తగ్గించింది అని ఆయన పేర్కొన్నారు. రిపోర్ట్స్ ప్రకారం  "పిండం కణ తంతువుల గురించి చెప్పనవసరం లేదు" మరియు "మేము టాపిక్ నుండి దూరంగా ఉండాలి" అని గెల్మాన్ రాశారు. 

Pfizer whistleblower: ఈ వివాదం నేపథ్యంలో ఇప్పుడు మెలిస్సా మెక్‌టీ చేసిన పోస్ట్ సంచలనంగా మారింది. ఇప్పటికే ఇద్దరు విజిల్‌బ్లోయర్ ల మరణం ఇబ్బందికర పరిస్థితులు సృష్టించిన పరిస్థితుల్లో తాజాగా ఇలాంటి ఆరోపణలు రావడం ఫైజర్ కంపెనీకి సమస్యలు సృష్టిస్తుందని భావిస్తున్నారు. 

#pfizer #whistle-blower
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe