Vijaywada: విజయవాడ – అవనిగడ్డ కరకట్టపై గత వారం కాలుష్య నియంత్రణ మండలి, ఏపీ ఖనిజాభివృద్ది సంస్థలకు (APMDC) చెందిన బస్తాల కొద్ది దస్త్రాలను తగలబెట్టిన సంగతి తెలసిందే. ఇందులో కొన్ని ఫైళ్లు సీఎంఓకు చెందినవి కాగా, మరికొన్ని కాలుష్య నియంత్రణ మండలికి చెందిన హార్డ్ డిస్కులు ఉన్నాయి. ఫైళ్ల పై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాలుష్య నియంత్రణ మండలి మాజీ ఛైర్మన్ సమీర్ శర్మ ఫోటోలు ఉన్నాయి. ఈ సంఘటనపై డిప్యూటీ సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also read: బాలినేనికి ఇదే నా సవాల్.. అలా చేయకపోతే రాజకీయాలకు దూరంగా ఉంటా: సుబ్బారావు గుప్తా
తాజాగా, పీసీబీ ఫైల్స్ దహనం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బెజవాడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆఫీసులో 7 సెక్షన్లకు సంబంధించిన అధికారులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఫైల్స్, హార్డ్‌డిస్క్‌లు ఆఫీస్ నుంచి బయటకు వెళ్లడంపై ఆరా తీస్తున్నారు. మూడు రోజులుగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కార్యాలయంలో తనిఖీలు కొనసాగుతున్నాయి.