AP: దమ్ముంటే అసెంబ్లీకి రా.. జగన్‌కు పయ్యావుల సవాల్.!

ఢిల్లీలో ఏపీ మాజీ సీఎం జగన్‌ ధర్నాపై మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శలు చేశారు. ఢిల్లీకి ధర్నా కోసం వెళ్లినట్టు లేదని..ఇండి కూటమితో చర్చలకు వెళ్లినట్టు ఉందని అన్నారు. 'నీకు దమ్ముంటే అసెంబ్లీకి రా' అంటూ జగన్ కు పయ్యావుల సవాల్ విసిరారు.

New Update
AP: దమ్ముంటే అసెంబ్లీకి రా.. జగన్‌కు పయ్యావుల సవాల్.!

Payyavula Keshav: ఢిల్లీలో ఏపీ మాజీ సీఎం జగన్‌ ధర్నా చేసిన సంగతి తెలిసిందే. ఏపీలో జరుగుతున్న హింసాత్మక ఘటనలకు నిరసనగా తన పార్టీ నేతలతో జంతర్‌మంతర్‌ వద్ద నిరసన తెలిపారు. ఏపీలో వైసీపీ శ్రేణులే టార్గెట్‌గా దాడులు జరుగుతున్నాయన్నారు. అయితే, జగన్ ధర్నాపై టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు విమర్శలు గుప్పిస్తున్నారు. అసెంబ్లీకి వచ్చే ధైర్యం లేకే జగన్ ఢిల్లీ వెళ్లి డ్రామాలు అడుతున్నాడని.. తప్పించుకుని తిరిగుతున్నాడని సెటైర్లు వేస్తున్నారు.

తాజాగా, జగన్‌ ధర్నాపై మంత్రి పయ్యావుల కేశవ్ పంచులు వేశారు. ఢిల్లీకి ధర్నా కోసం వెళ్లినట్టు లేదని..ఇండి కూటమితో చర్చలకు వెళ్లినట్టు ఉందని అన్నారు. 'నీకు దమ్ముంటే అసెంబ్లీకి రా' అంటూ మాజీ సీఎం జగన్ కు పయ్యావుల సవాల్ విసిరారు. శాంతిభద్రతలపై సభలో మాట్లాడు.. ఢిల్లీ రోడ్ల మీద గగ్గోలు పెట్టడం దేనికి? అంటూ పయ్యావుల ప్రశ్నించారు. ఇవాళ శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల చేస్తున్నామని.. జగన్ అసెంబ్లీకి రావాలని పయ్యావుల పిలుపునిచ్చారు.

Advertisment
తాజా కథనాలు