Pawan reaction on Chandrababu Arrest: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై జనసేన (janasena) అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. చంద్రబాబు అరెస్టును తీవ్రంగా ఖండించారు జనసేనాని పవన్ కళ్యాణ్.ప్రాథమిక ఆధారాలను చూపించకుండా అర్థరాత్రి అరెస్ట్ చేయడం దుర్మార్గం అన్నారు.
విశాఖపట్నంలో జనసేన పట్ల ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగిందని..ఏ తప్పూ చేయని నాయకులపై మర్డర్ కేసులు పెట్టి జైళ్లకు నెడుతున్నారంటూ విమర్శించారు. పాలన పరంగా అనుభవం ఉన్నా వ్యక్తి పట్ల ప్రభుత్వ తీరు సరైంది కాదని అన్నారు.శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అంశంలో ప్రభుత్వం పోలీసులు అందరి పట్ల ఒకలా వ్యవహరించాలన్నారు. అరెస్టుపై నిరసన తెలిపితే హౌస్ అరెస్టులు చేస్తారా? అంటూ మండిపడ్డారు. చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన సందర్భంగా జరిగిన ఘటనలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను వైసీపీ ప్రభుత్వమే ప్రోత్సహిస్తోందనే విషయం అర్థమవుతోందని చెప్పారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తీసుకుంటామని వైసీపీ నేతలు వరుసగా చెపుతున్నారని..కానీ, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సింది పోలీసులని.. ఈ విషయంలో వైసీపీకి సంబంధం ఏమిటని ప్రశ్నించారు. కేవలం జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే శాంతిభద్రతలు దారుణంగా తయారయ్యాయని పవన్ అన్నారు.
ఒక పార్టీ అధినేత అరెస్టయితే ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు మద్దతుగా రావడం సహజంగా జరిగే పనేనని.. నాయకుడి కోసం అందరూ వస్తారని, ప్రజాస్వామ్యంలో ఇది భాగమని పవన్ చెప్పారు. ఇళ్ల నుంచి వాళ్లు బయటకు రాకూడదు, రోడ్ల మీదకు రాకూడదు అనుకుంటే ఎలా? అని ప్రశ్నించారు. వైసీపీ నాయకులేమో అక్రమాలు చేయొచ్చు, దోపిడీలు చేయొచ్చు, జైళ్లలో మగ్గిపోవచ్చు..విదేశాలకు కూడా వెళ్లొచ్చు కానీ ఇతర పార్టీ నాయకులు అరెస్ట్ అరెస్టయినప్పుడు వారు పార్టీ నేతలు ఇంట్లో నుంచి కూడా బయటకు రాకూడదని శాసిస్తే ఎలా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్ట్ లా అండ్ ఆర్డర్ అంశం పూర్తిగా కక్ష సాధింపు చర్యేనని జనసేనాని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు అండగా ఉంటానని..తనకు మద్దతు తెలుపుతున్నాని పవన్ వ్యాఖ్యనించారు.
చంద్రబాబు అరెస్ట్ పై జనసేన అధినేత పవన్ తో పాటు జనసైనికులు స్పందించారు. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ పొత్తు ఉంటుందని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో చంద్రబాబు అరెస్ట్ ను జనసేన ఖండించడం..చంద్రబాబుకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలపడంతో కచ్చితంగా టీడీపీ, జనసేన పొత్తు ఉంటుందని జోరుగా ప్రచారం జరుగుతోంది.
Also Read: నా తండ్రిని చూసే హక్కు కూడా నాకు లేదా? ఆ సైకో చెప్పాడా నీకు ? పొదలాడలో టెన్షన్ టెన్షన్!