Paris Paralympics 2024: పారాలింపిక్స్ లో భారత్ కొత్త రికార్డ్.. తొలిసారిగా 29 పతకాలు!

పారిస్ లో జరుగుతున్న పారాలింపిక్స్-2024 భారత క్రీడాకారులు చరిత్ర సృష్టించారు. తొలిసారిగా భారత్ కు 29 పతకాలను అందించారు. పారాలింపిక్స్ లో చరిత్ర సృష్టించి..మెడల్స్ పట్టికలో భారత్ ను 16వ స్థానంలో నిలిపారు. ఇంతకు ముందు టోక్యోలో సాధించిన 19 పతకాలు భారత్ అత్యుత్తమ ప్రదర్శన

New Update
Paris Paralympics 2024: పారాలింపిక్స్ లో భారత్ కొత్త రికార్డ్.. తొలిసారిగా 29 పతకాలు!

Paris Paralympics 2024: పారిస్ పారాలింపిక్స్-2024లో భారత్ చారిత్రాత్మక ప్రదర్శన చేసి 7 స్వర్ణాలతో సహా 29 పతకాలను గెలుచుకుని తన ప్రయాణాన్ని ముగించింది. 10వ రోజు, శనివారం, సెప్టెంబర్ 7, దేశానికి 3 పతకాలు వచ్చాయి. ఈరోజు (సెప్టెంబర్ 8) రాత్రి 11:30 గంటలకు క్రీడల ముగింపు కార్యక్రమం జరగనుంది.

ఇక పతకాల పట్టికలో చూసుకుంటే, భారత్ 16వ స్థానంలో నిలిచింది. దేశానికి 7 స్వర్ణాలు, 9 రజతాలు, 13 కాంస్య పతకాలు వచ్చాయి. ఇది భారతదేశం ఆల్-టైమ్ అత్యుత్తమ ప్రదర్శన.  దీనికి ముందు దేశం టోక్యోలో 5 స్వర్ణాలతో సహా 19 పతకాలను గెలుచుకుంది.

Paris Paralympics 2024: చివరి రోజు, పురుషుల ఎఫ్ 41 విభాగంలో ఇరాన్ అథ్లెట్ బీత్ సయా సదేగ్ అనర్హత వేటుతో నవదీప్‌కు స్వర్ణం లభించినప్పటికీ, భారత జావెలిన్ త్రోయర్ నవదీప్ రజత పతకాన్ని గెలుచుకున్నాడు. నవదీప్‌తో పాటు మహిళల టీ-12 విభాగంలో 200 మీటర్ల రేసులో సిమ్రాన్ ఒక్కో కాంస్య పతకాన్ని, పురుషుల షాట్‌పుట్‌లో నాగాలాండ్‌కు చెందిన హొకాటో సెమా ఒక్కో కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. ఇతను 22 ఏళ్ల క్రితం ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్‌లో ఎడమ కాలు కోల్పోయాడు.

అథ్లెటిక్స్‌లో అత్యధికంగా 17 పతకాలు..

టోక్యోలో 19 పతకాలు సాధించిన భారత్ ఈసారి ఒక్క అథ్లెటిక్స్‌లోనే 17 పతకాలు తెచ్చుకుంది.  అథ్లెట్లు 4 స్వర్ణాలు, 6 రజతాలు, 7 కాంస్య పతకాలు సాధించారు. బ్యాడ్మింటన్ రెండో అత్యుత్తమ క్రీడ కాగా.. ఇందులో 1 స్వర్ణం, 2 రజతం, 2 కాంస్య పతకాలు వచ్చాయి.

Paris Paralympics 2024: పారా ఆర్చరీలో భారత్‌కు తొలిసారిగా బంగారు పతకం లభించగా, హర్విందర్ సింగ్ ఈ ఘనత సాధించాడు. ఆర్చరీలో రాకేశ్‌కుమార్‌, శీతల్‌ దేవి జంట కూడా కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. షూటింగ్‌లో 1 స్వర్ణం, 1 రజతం, 2 కాంస్య పతకాలు సాధించాడు. ఇవి కాకుండా జూడోలో తొలిసారి కాంస్య పతకం సాధించింది.

మొత్తంగా చూసుకుంటే పతకాల పట్టికలో 94 స్వర్ణాలతో మొత్తం 216 పతకాలను గెలిచి చైనా టాప్ ప్లేస్ లో నిలిచింది. ఆ తరువాత బ్రిటన్ 47 గోల్డ్ మెడల్స్ తో మొత్తం 120 మెడల్స్ సాధించి రెండో స్థానంలోనూ, అమెరికా 32 స్వర్ణ పతకాలు సహా 120 పతకాలు గెలిచి మూడోస్థానంలో ఉంది. 

Advertisment
తాజా కథనాలు