Paris Olympics 2024: ఈరోజు నాలుగు మెడల్స్ కి ఛాన్స్.. ఒలింపిక్స్ లో భారత్ ఈవెంట్స్ ఇవే!

పారిస్ ఒలింపిక్స్ లో ఈరోజు అంటే ఆగస్టు 8న నాలుగు మెడల్స్ వచ్చే ఛాన్స్ ఉంది. నీరజ్ చోప్రా జావెలిన్ త్రో లో గోల్డ్ కోసం, కాంస్య పతకం కోసం హాకీ టీమ్, రెజ్లింగ్ లో అన్షు మాలిక్, అమన్ సెహ్రావత్‌ మెడల్స్ కోసం పోటీలో ఉన్నారు. ఈ పోటీల షెడ్యూల్ ఆర్టికల్ లో చూడవచ్చు.

Paris Olympics 2024: ఈరోజు నాలుగు మెడల్స్ కి ఛాన్స్.. ఒలింపిక్స్ లో భారత్ ఈవెంట్స్ ఇవే!
New Update

Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌లో 13వ రోజున భారత్ 3 క్రీడాంశాల్లో 4 పతకాలు సాధించవచ్చు. అయితే ఇదంతా ఆటగాళ్ల ప్రదర్శనపై ఆధారపడి ఉంటుంది. ఈరోజు పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ పతకాలు సాధిస్తుందని భావిస్తున్న మూడు క్రీడల్లో రెజ్లింగ్, హాకీ, జావెలిన్ త్రో ఉన్నాయి. వీటిలో రెజ్లింగ్‌లో భారత్ 2 పతకాలను సాధించే అవకాశం ఉందని అంచనాలు వేస్తున్నారు. 

హాకీలో కాంస్య పతక పోరు ఎప్పుడంటే..

పారిస్‌ ఒలింపిక్స్‌ హాకీలో కాంస్య పతక పోరులో స్పెయిన్‌తో భారత్‌ తలపడనుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ సాయంత్రం 5:30 గంటలకు జరగనుంది.

నీరజ్ చోప్రా ఫైనల్ ఏ సమయంలో..

Paris Olympics 2024లో నీరజ్ చోప్రా జావెలిన్ త్రో ఫైనల్ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 11.50 గంటలకు ప్రారంభమవుతుంది. ఇందులో కచ్చితంగా స్వర్ణ పతాకం సాధిస్తాడనే అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే క్వాలిఫికేషన్‌లోనూ మొదటి స్థానంలో ఇతర ప్రత్యర్థులకు ఎవరికీ అందనంత దూరంలో నీరజ్ నిలిచాడు. 

రెజ్లింగ్‌లో కచ్చితంగా 2 పతకాలు రావచ్చు

Paris Olympics 2024: వినేష్, నిషా - పంఘల్ వైఫల్యం తర్వాత, భారతదేశం ఈ రోజు రెజ్లింగ్‌లో రెండు విజయ కథలను రాసే ఛాన్స్ కనిపిస్తోంది. అన్షు మాలిక్, అమన్ సెహ్రావత్‌లు పతకాలు సాధించడం ద్వారా భారత్‌కు అవకాశం కల్పిస్తారు. ఈరోజు రెజ్లింగ్‌లో 2 పెద్ద ఈవెంట్‌లు ఉన్నాయి. ఈ రెండు కార్యక్రమాలు మధ్యాహ్నం 3 గంటల తర్వాత ప్రారంభమవుతాయి. పురుషుల 57 కేజీల విభాగంలో భారత రెజ్లర్ అమన్ సెహ్రావత్ బరిలోకి దిగనున్నాడు. మహిళల 57 కేజీల విభాగంలో అన్షు మాలిక్ మ్యాట్‌పై పోరాడుతోంది.

భారత్ పాల్గొనే ఈవెంట్స్ షెడ్యూల్ ఇదే.. 

12:30 PM

గోల్ఫ్ మహిళల  వ్యక్తిగత స్ట్రోక్ ప్లే రౌండ్ 2

02:05 PM

అథ్లెటిక్స్ మహిళల 100మీ హర్డిల్స్ రెపెచేజ్ రౌండ్ - హీట్ 1స్టేజ్ 

02:58 PM

రెజ్లింగ్ పురుషుల  ఫ్రీస్టైల్ 57 కేజీ 1/8 ఫైనల్ అమన్ అమన్ Vs వ్లాదిమిర్ ఎగోరోవ్చాంప్

02:58 PM

రెజ్లింగ్ మహిళల  ఫ్రీస్టైల్ 57కిలోలు 1/8 ఫైనల్ హెలెన్ లూయిస్ మారులిస్ Vs అన్షు అన్షుచాంప్

05:30 PM

ఫీల్డ్ హాకీపురుషుల కాంస్య పతక పోరులో భారత్ Vs స్పెయిన్  

11:55 PM

అథ్లెటిక్స్ పురుషుల జావెలిన్ త్రో ఫైనల్స్టేడ్ డి ఫ్రాన్స్

#paris-olympics-2024
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe