Parenting Tips: పేరెంట్స్ పిల్లల మానసిక ఆరోగ్యం ప్రత్యేక శ్రద్ధ వహించాలి. కొన్ని సార్లు వాళ్ళ పనుల్లో బిజీగా ఉంటూ అంతగా శ్రద్ధ చూపలేకపోతారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం.. ప్రతి నలుగురు పిల్లల్లో ఒకరు మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. ఈ మధ్య కాలంలో పిల్లలు, పెద్ద వాళ్ళు చాలా మందిలో మానసిక ఆరోగ్య సమస్యలు తరచుగా కనిపిస్తున్నాయి. అకాడమిక్ స్ట్రెస్, కుటుంబ పరిస్థితులు, ఒంటరిగా ఉండడం ఇవ్వన్నీ పిల్లల మానసిక ఆరోగ్యం పై ప్రభావం చూపును.
- పేరెంట్స్ ఎంత బిజీగా ఉన్న.. పిల్లల పై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. పిల్లలకు ఒంటరిగా ఉన్న భావన రాకుండా.. వాళ్ళతో ఎక్కువ సమయం గడపాలి. అలాగే వాళ్ళ ఫీలింగ్స్ అర్థం చేసుకొని.. వారికి సపోర్ట్ గా ఉండాలి ఇలా చేస్తే పిల్లల్లో దైర్యం పెరుగుంతుంది. కొంత మంది పిల్లలు పేరెంట్స్ అటెన్షన్ ఎక్కువగా కోరుకుంటారు. అది లేనప్పుడు వాళ్ళు మానసికంగా డిస్టర్బ్ అవుతారు. అందుకే వాళ్ళతో ఎక్కువగా మాట్లాడడం, ఆడుకోవడం చేయాలి.
- ఈ మధ్య కాలంలో చాలా మంది తల్లిదండ్రులు పిల్లలు ఏడ్చిన, ఫుడ్ తినకపోయిన వాళ్ళకు ఫోన్ ఇవ్వడం, లేదా టీవీ చూపించడం చేస్తుంటారు. కొంత మంది పిల్లలు ఫీజికల్ యాక్టివిటీ చేయకుండ కేవలం ఫోన్స్ మాత్రమే చూస్తూ ఉంటారు. ఇలా పిల్లలకు ఎక్కువగా ఫోన్స్ ఇవ్వడం వల్ల అది వాళ్ళ మానసిక ఆరోగ్యం పై ప్రభావం చూపును. పేరెంట్స్ పిల్లల స్క్రీన్ టైం, ఫీజికల్ యాక్టివిటీ రెండింటినీ సమంగా ప్లాన్ చేయాలి. ఆటలు ఆడించడం, వాళ్ళతో నేరుగా కూర్చొని మాట్లాడడం, స్టోరీస్ చెప్పడం వంటివి చేస్తే వాళ్ళ మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
- కొంత మంది పిల్లల్లో అకాడమిక్ స్ట్రెస్ ఎక్కువైనప్పుడు అది వాళ్ళ మానసిక ఆరోగ్యం పై ప్రభావం చూపును. ఇలాంటి సమయంలో తల్లిదండ్రులు పిల్లలకు.. టైం ఎలా మానేజ్ చేసుకోవాలి.. వర్క్ బర్డెన్ ఎక్కువైనప్పుడు ఎలా సింప్లిఫై చేయాలి అనే టిప్స్ చెప్పి వాళ్ళను ప్రోత్సహించాలి. అంతే కాదు చాలా మంది పేరెంట్స్ పిల్లలు ఎంత నేర్చుకున్నారు అనే దాని కంటే.. వారి గ్రేడ్స్ పై ఎక్కువ శ్రద్ధ పెడతారు. ఇది వారిలో మరింత మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది.
- పిల్లల కోసం టైం కేటాయించి.. వారిని బయట ప్రదేశాలకు తీసుకువెళ్ళాలి. ఇలా చేస్తే పిల్లలు పిల్లల మానసిక ఒత్తిడి తగ్గి హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగే పిల్లలకు వాళ్ళ అభిప్రాయాలను చెప్పే స్వేచ్ఛను పేరెంట్స్ కలిగించాలి. వారి ఎమోషన్స్ అర్థం చేసుకొని వారిని ఎంకరేజ్ చేయాలి. దాని వల్ల పిల్లల మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.