Parenting Tips: చిన్న వయసులో పిల్లలకు నేర్పించే సానుకూల అలవాట్లే.. ఎదిగిన తర్వాత వారి జీవితం పై శాశ్వత ప్రభావాన్ని చూపుతాయి. పిల్లలను స్వతంత్రంగా, బాధ్యతగా పెంచడంలో తల్లిదండ్రులు ముఖ్య పాత్ర పోషిస్తారు. మీ పిల్లలు స్వతంత్రంగా, బాధ్యతగా ఉండాలంటే.. రోజు ఉదయం లేవగానే ఈ అలవాట్లు పాటించేలా చేయండి.
పిల్లలు ఉదయం లేవగానే పాటించాల్సిన అలవాట్లు
త్వరగా నిద్రలేవాలి
చాలా మంది పేరెంట్స్ పిల్లలు ఎక్కువ సేపు పడుకున్నా..సరే వారిని నిద్ర లేపకుండా.. అలానే వదిలేస్తారు. కానీ అలా చేయడం వల్ల వారిలో క్రమశిక్షణ తప్పడమే కాకుండా ఎదిగిన తర్వాత కూడా అదే అలవాటుగా మారుతుంది. అందుకనే రోజు ఒకే టైం కి నిద్రలేచేలా వారికి అలవాటు చేయాలి దాని వల్ల క్రమశిక్షణ కూడా అలవరుతుంది.
లేచిన తర్వాత బెడ్ సెట్ చేయడం
పిల్లలు నిద్రలేవగానే బెడ్ సెట్ చేయడం.. బెడ్ షీట్స్ మడత పెట్టడం వంటి అలవాట్లను వారికి నేర్పించాలి. దాని వల్ల పిల్లల్లో బాధ్యతగా ఉండే లక్షణాలు ఏర్పడతాయి. చిన్నప్పుడే ఇలాంటివి నేర్పడం వల్ల ఎదిగిన తర్వాత కూడా వాళ్లకు సంబందించిన విషయాల్లో బాధ్యత గా ఉండడం అలవాటవుతుంది.
మార్నింగ్ హైజిన్
ఉదయం లేవగానే పిల్లలు వాళ్ళ పనులు సొంతగా చేసుకోవడం నేర్పించాలి. స్నానం చేయడం, మొహం కడగడం.. దాని వల్ల పిల్లల్లో వారి పనులను సొంతగా చేసుకోగలిగే ఆత్మ విశ్వాసం కూడా పెరుగుతుంది.
ఉదయం లేవగానే ధ్యానం చేయడం నేర్పాలి
పిల్లలకు ఉదయం లేవగానే మెడిటేషన్, ప్రార్థన చేయడం నేర్పించాలి. దాని వల్ల పిల్లల్లో కృతజ్ఞత భావం, పాజిటివ్ నేచర్ పెంపొందుతాయి. అలాగే పిల్లల మనసు ప్రశాంతంగా ఉండడంతో పాటు వారిలో శ్రద్ధ కూడా పెరుగుతుంది.
ఆడుకోవడం
తల్లిదండ్రులు పిల్లలు మార్నింగ్ రొటీన్ లో.. ఉదయం లేవగానే 20 నుంచి 30 నిమిషాల పాటు ఆడుకోవడానికి వారికి సమయం కేటాయించాలి. ఇలా చేయడం పిల్లలను ఉత్తేపరచడమే కాకుండా.. రోజంతా వారిని చురుకుగా, అలర్ట్ గా ఉండేలా చేస్తుంది.
పిల్లలకు కావాల్సిన వస్తువులను వాళ్ళే ప్యాక్ చేసుకోవడం
ఉదయాన్నే స్కూల్ కు వెళ్లేటప్పుడు తల్లిదండ్రులు వారికి కావాల్సినవి అన్నీ.. దగ్గరుండి మరీ సర్ది పెడతారు. కానీ ఇలా చేస్తే వారు ప్రతి సారి పేరెంట్స్ పై డిపెండ్ అవ్వడం నేర్చుకుంటారు. అందుకని ప్రతి రోజూ వారి లంచ్ బాక్స్, బుక్స్, వాటర్ బాటిల్ అన్ని వాళ్ళే ప్యాక్ చేసుకోవడం అలవాటు చేయాలి. ఇలా చేస్తే వారిలో ఆర్గనైజేషనల్ స్కిల్స్ తో పాటు స్వతంత్రంగా వారి పనులను చేసుకునే ఆత్మ విశ్వాసం కూడా పెరుగుతుంది.
Also Read: Health Benefits: శీతాకాలంలో చిన్నపిల్లల విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి