Parenting Tips: పిల్లలు ఇలా మాట్లాడితే.. తల్లిదండ్రులు శ్రద్ద పెట్టాల్సిందే సాధరణంగా కొన్ని సార్లు చిన్న పిల్లలు ఏదైనా చెబితే పేరెంట్స్ పట్టించుకోకుండా లైట్ తీసుకుంటారు. కానీ పిల్లలు చెప్పే ఈ మాటలు మాత్రం అస్సలు లైట్ తీసుకోవద్దు. నేను చేయలేను, భయంగా ఉంది, నన్ను ఎవరూ ఇష్టపడడం లేదు, స్కూల్ కి వెళ్ళాలని లేదని చెబితే వాటి వెనుక కారణాలు తెలుసుకోండి By Archana 31 Jan 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Parenting Tips: పిల్లలు క్రమశిక్షణగా,బాధ్యతగా ఎదగడం వెనుక తల్లి దండ్రులు ముఖ్య పాత్ర పోషిస్తారు. చిన్న వయసులో పిల్లలకు తల్లి దండ్రులు చెప్పే మాటలే పెద్దయ్యాక వారి విలువలు మారుతాయి. అందుకే పిల్లల పెంపకంలో పేరెంట్స్ ప్రత్యేక శ్రద్ద పెట్టాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు.. సరైన దారిలోనే వెళ్తున్నారా లేదా అని గమనిస్తూ ఉండాలి. అయితే కొన్ని సార్లు తల్లిదండ్రులు బిజీగా ఉంటూ పిల్లలు చెప్పే కొన్ని మాటలు అసలు పట్టించుకోరు. ఇలా పిల్లలు చెప్పే కొన్ని మాటలు అసలు నెగ్లెక్ట్ చేయకూడదు. అవేంటో ఇప్పుడు చూద్దాం. స్కూల్ కు వెళ్ళను అని చెప్పడం సాధారణంగా పిల్లలు స్కూల్ కు వెళ్ళడం ఇష్టం లేదని చెప్పడం కామన్. అందులో కొంత మంది పిల్లలు నిజంగానే ఇష్టం ఉండకపోవచ్చు .. కానీ మరి కొంత మంది పిల్లల అక్కడ పరిస్థితులు నచ్చక వెళ్లనని చెబుతుంటారు. ఇలాంటి పిల్లలు అలా చెప్పడానికి కారణం ఏంటో పేరెంట్స్ తెలుసుకునే ప్రయత్నం చేయాలి. కొన్ని సార్లు అక్కడ వాళ్లకు కలిగిన అసౌకర్యమైన సంఘటనలు కూడా దానికి కారణమవ్వచ్చు. Also Read: Pre Heating Foods: ఈ ఆహారాలు వేడి చేసి తింటున్నారా..? అయితే జాగ్రత్త నేను చేయలేను పిల్లలు ఏదైనా చెప్పినప్పుడు లేదా చూసినప్పుడు నేను చేయలేను అని చెప్పడం. ఒకసారి చెబితే పర్వాలేదు కానీ ప్రతీ సారి నేను చేయలేను అని చెప్పడం పిల్లల ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. ఇలాంటివి చెప్పినప్పుడు పిల్లలను ప్రోత్సహించే ప్రయత్నం చేయాలి. నేను అంటే ఎవరికీ ఇష్టం లేదు పిల్లలు ఇలా అనడం తల్లిదండ్రులు అస్సలు లైట్ తీసుకోవద్దు. ఇలా చెప్పడం ఒంటరితనం అనే భావనను కలిగించి.. ఒంటరితనం అనే పిల్లల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. భయంగా ఉందని చెప్పడం పిల్లలు భయం, ఆందోళనగా ఉందని చెప్పడం. ఇలా చెప్పినప్పుడు దానికి కారణమేంటో తెలుసుకోవాలి. అలాగే వారికి అండగా, దైర్యం చెప్తూ.. మోటివెట్ చేయాలి . లేదంటే వాళ్లకు ఆ భయాలు జీవితాంతం ఉండే అవకాశం ఉంటుంది. Also Read: Moong Dal Halwa: నోరూరించే పెసర పప్పు హల్వా.. సింపుల్ అండ్ ఈజీ #parenting-tips మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి