/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/parag-desai-jpg.webp)
వాఘ్ బక్రీ టీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పరాగ్ దేశాయ్(Parag Desai)పై అసలు కుక్కలు దాడి చేయలేదా? కుక్కల దాడిలో ఆయన మెదడుకు దెబ్బతగిలినట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదా? పరాగ్ దేశాయ్ మరణంలో ఊహించని ట్విస్ట్ ఇది. కుక్కలు దాడి చేస్తే గాట్లు ఉండాలి కదా.. పరాగ్ దేశాయ్ శరీరంపై ఎక్కడా కూడా ఒక్క కుక్క గాటు కూడా లేదట. ఈ విషయాన్ని స్వయంగా ఆయనకు చికిత్స చేసిన ఆస్పత్రి వర్గాలే చెప్పడం సంచలనంగా మారింది. మరి పరాగ్ మృతికి కారణం ఏంటి? అసలు ఆస్పత్రి వర్గాలు ఏం చెప్పాయి?
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-24-at-9.42.47-PM-1-jpeg.webp)
అసలేం జరిగింది?
అక్టోబర్ 15న ఎప్పటిలాగే పరాగ్ మార్నింగ్ వాక్‌కు వెళ్లారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో తన ఇంటి దగ్గరే వాకింగ్ వెళ్లారు. అయితే అక్కడ వీధి కుక్కలు ఆయనపై దాడి చేశాయని.. వాటిని తరిమే ప్రయత్నంలో ఆయన కిందపడిపోయినట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆయన కిందపడిపోయిన విషయం నిజమే కాని.. కుక్కల దాడిపై మాత్రం ఆస్పత్రి వర్గాలు ఓ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. పరాగ్ కిందపడిపోయిన తర్వాత ముందుగా ఆయన్ను కుటుంబసభ్యులు షాల్బీ ఆస్పత్రిలో చేర్చారు. మరుసటి రోజు పరాగ్‌ని నగరంలోని జైడస్ ఆసుపత్రికి తరలించారు. అయితే తమ వద్దకు పరాగ్‌ని చికిత్స కోసం తీసుకొచ్చినప్పుడు అసలు ఆయన శరీరంపై కుక్క గాటుకు సంబంధించి ఎలాంటి గాయాలు కనిపించలేదని షాల్బీ ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. కుక్క కాటు గుర్తులు కూడా లేవని స్పష్టం చేస్తున్నాయి. ఆయనకు సబ్‌డ్యూరల్ హెమటోమా ఉన్నట్లు నిర్ధారించామని.. 72 గంటలు అబ్జర్వేషన్‌లో ఉంచాలని కుటుంబసభ్యులను కోరినట్లు షాల్బీ హాస్పిటల్స్ గ్రూప్ సీఓఓ డాక్టర్ నిషితా శుక్లా తెలిపారు. అయితే బంధువుల కోరిక మేరకు ఆయన్ను డిశ్చార్జి చేశామన్నారు.
The animal welfare community deeply mourns the passing of Shri Parag Desai, Wagh Bakri Tea group executive Director, who was a generous benefactor of the cause and a staunch supporter of street dogs.
His demise is a huge and personal loss to all of us who care about animals.… pic.twitter.com/rmkGImXhMc— Kamna Pandey 🌱 (@PandeyKamna) October 23, 2023
ఆయనకు కుక్కలంటే ఇష్టం:
పరాగ్ దేశాయ్ నిజానికి డాగ్ లవర్. ఆయన వీధి కుక్కల కోసం ఎన్నో మంచి పనులు చేశారు. కుక్కలను అమితంగా ఇష్టపడే వ్యక్తి ఆయన. అంతేకాదు కుక్కలను చూసి పారిపోయే మనిషి కాదు. వీధి కుక్కలను ఎలా డీల్ చేయాలో ఆయనకు తెలుసు. కుక్కలను చూసి ప్యానిక్ ఐపోయే అంతా భయం పరాగ్‌కు లేదన్న వాదన వినిపిస్తోంది. ఇదే విషయాన్ని జంతు హక్కుల కార్యకర్త కామ్నా పాండే ట్విట్టర్ ధ్రువీకరిస్తున్నారు. వీధి కుక్కల గురించి ఎన్నో విషయాలు తెలిసిన పరాగ్ వాటని చూసి భయాందోళనకు గురికావడం అసాధ్యమని ఆమె చెబుతున్నారు. వీధి కుక్కలు ఎలా ప్రవర్తిస్తాయో ఆయనకు తెలుసని.. పరాగ్ వాటిని పరిగెత్తే ఛాన్స్ లేదంటున్నారు ఆమె. కుక్కలు మొరగడం వల్ల కానీ.. ఆయన్ను తరమడం వల్ల కానీ ఆయన భయపడే అవకాశం లేదని.. కిందపడిపోవడంతో బ్రెయిన్‌కు డ్యామేజ్ ఐనట్టుగా భావిస్తున్నట్టు చెప్పారు. ఆ సమయంలో కుక్కలు అక్కడ ఉండి మొరగడానికి గల కారణాలను కూడా చెప్పారు కామ్నా. కుక్కలు తమను ప్రేమించే వారిని అసలు కరవవని.. ఆ సమయంలో పరాగ్ కిందపడి ఉండడంతో ఆయనకి సాయం చేయాల్సిందిగా కుక్కలు మొరిగి ఉండొచ్చని ఆమె అభిప్రాయపడుతున్నారు. కుక్కలు దాడి చేయడాన్ని ఎవరూ కూడా చూడలేదని.. ఆయన కింద పడిన సమయంలో అవి మొరుగుతుండడంతో అంతా అలా భావిస్తున్నారని చెబుతున్నారు కామ్నా.
2వేల కోట్ల కోటీశ్వరుడు:
వాఘ్ బక్రీ టీ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ రసేష్ దేశాయ్ కుమారుడు పరాగ్ దేశాయ్. ఆయనకు 49 ఏళ్లు. భార్య విదిష, కుమార్తె పరిష ఉన్నారు. దేశాయ్‌కు బిజినెస్‌లో ఎంతో అనుభవం ఉంది. ఇంటర్నేషనల్ బిజినెస్, సేల్స్, మార్కెటింగ్‌కు నాయకత్వం వహించారు. సీఐఐలో సభ్యుడిగా ఉన్నారు. 1892లో నారదాస్ దేశాయ్ స్థాపించిన వాఘ్ బక్రీ టీ గ్రూప్‌కు..ఇవాళ 2వేల కోట్ల టర్నోవర్ ఉంది. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఛత్తీస్ గఢ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, గోవా, పంజాబ్, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌లో ఈ గ్రూప్ విస్తరించి ఉంది. అంతటి ప్రముఖ వ్యాపారవేత వీధికుక్కల దాడిలో గాయపడి మరణించాడన్న వార్త సంచలనం రేపగా.. షాల్బీ ఆస్పత్రి వర్గాలతో పాటు కామ్నా చేసిన వ్యాఖ్యలు ఆయన మరణంలో ఊహించని ట్విస్ట్‌గా మారింది.
Also Read: ప్రతిఒక్కరూ 10 ప్రతిజ్ఞలు చేయండి.. దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు