పారాసిటమాల్‌తో ఇంత ప్రమాదమా! జ్వరం, తలనొప్పి, దగ్గు.. ఇలా ప్రతి చిన్న సమస్యకు పారాసిటమాల్ వేసుకోవడం అలవాటు చాలామందికి.ఇలా జ్వరానికి, నొప్పులకు, నీరసానికి పారాసిటమాల్ వేసుకోవడం వల్ల చాలా నష్టాలే ఉంటాయంటున్నారు డాక్టర్లు. ఈ అలవాటు వల్ల లాంగ్‌టర్మ్‌లో చాలానే సైడ్ ఎఫెక్ట్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. By Durga Rao 20 Jun 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి పారాసిటమాల్ అతిగా వాడితే ఏం జరుగుతుందంటే.. ఇళ్లల్లో ఏ మెడిసిన్ ఉన్నా లేకపోయినా పారాసిటమాల్ టాబ్లెట్ షీట్ మాత్రం కచ్చితంగా ఉంటుంది. జ్వరం, తలనొప్పి, దగ్గు.. ఇలా ప్రతి చిన్న సమస్యకు పారాసిటమాల్ వేసుకోవడం అలవాటు చాలామందికి. ఈ అలవాటు వల్ల లాంగ్‌టర్మ్‌లో చాలానే సైడ్ ఎఫెక్ట్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. పారాసిటమాల్ టాబ్లెట్లను అతిగా వాడడం వల్ల మోషన్స్, కళ్లు తిరగడం, వాంతులు వంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కొంతమందికి అలర్జీలు కూడా రావొచ్చు. పారాసిటమాల్ టాబ్లెట్లను అదేపనిగా వాడడం వల్ల లాంగ్ టర్మ్‌లో మూత్ర పిండాలు, కాలేయం వంటి అవయవాలు దెబ్బతినే అవకాశం ఉంది. ఆల్కహాల్ తీసుకున్నప్పుడు పారాసిటమాల్ వేసుకుంటే అందులో ఉండే కాంపౌండ్స్ ఆల్కహాల్‌లోని ఇథనాల్‌తో నెగెటివ్ రియాక్షన్ జరిపి అవయవాలను దెబ్బతీసే ప్రమాదం ఉంటుంది. పారాసిటమాల్ ట్యాబ్లెట్‌ను ఆహారంతో లేదా పండ్ల రసంతో కలిపి తీసుకోవచ్చు. పెద్దలు సాధారణంగా 500ఎంజీ డోసేజీ తీసుకోవచ్చు. పిల్లలకు ఇంకా తక్కువ ఇవ్వాల్సి ఉంటుంది. శరీరంలో తేలికపాటి నొప్పులు ఉన్నప్పుడు లేదా లైట్‌గా ఫీవర్ వచ్చినప్పుడు సేఫ్టీ కోసం ఒక ట్యాబ్లెట్ వేసుకోవచ్చు. ఒకట్రెండు రోజులు పారాసిటమాల్ వాడిన తర్వాత సమస్య తగ్గకపోతే వెంటనే డాక్టర్‌ను కలవడం మంచిది. #life-and-health-tips మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి