TS Politics: కాంగ్రెస్ కు బిగ్ షాక్.. పాల్వాయి స్రవంతి రాజీనామా!

పాల్వాయి స్రవంతి కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని చేర్చుకోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న స్రవంతి ఈ రోజు పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. కేటీఆర్ సమక్షంలో ఆమె బీఆర్ఎస్ లో చేరుతారన్న ప్రచారం సాగుతోంది.

TS Politics: కాంగ్రెస్ కు బిగ్ షాక్.. పాల్వాయి స్రవంతి రాజీనామా!
New Update

Palvai Sravanthi Reddy: ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. దివంగత కాంగ్రెస్ సీనియర్ నేత పాల్వాయి గోవర్దన్ రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆమె బీఆర్ఎస్ లో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో తనకు మునుగోడు టికెట్ తప్పకుండా వస్తుందని స్రవంతి భావించారు. కానీ ఆఖరి నిమిషంలో పార్టీలో చేరిన రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ కేటాయించడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు స్రవంతి. అయితే రాజగోపాల్ రెడ్డి చేరిన తర్వాత తన వర్గీయులను పట్టించుకోవడం లేదని.. చేరికల విషయంలోనూ సమాచారం ఇవ్వడం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ పార్టీని దెబ్బకొట్టి ఉప ఎన్నికలకు వెళ్లిన రాజగోపాల్ రెడ్డిని మళ్లీ చేర్చుకోవడం ఏంటని ఆమె ప్రశ్నిస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి కారణంగా వచ్చిన ఉప ఎన్నికల్లో ఓడిపోతా అని తెలిసి కూడా.. తాను పార్టీ కోసం పోటీ చేశానని మంచి ఓట్లు సాధించానని చెబుతున్నారు. తన త్యాగాన్ని పట్టించుకోకుండా మళ్లీ రాజగోపాల్ రెడ్డిని చేర్చుకోవడంపై ఆమె తన అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పార్టీ వీడడని గత కొన్ని రోజులుగా చెబుతున్నా.. ఈ రోజు మాత్రం రాజీనామాను ప్రకటించారు. నేడు హైదరాబాద్ లో స్రవంతి ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ఈ ప్రెస్ మీట్ లో కోమటిరెడ్డి బ్రదర్స్, రేవంత్ రెడ్డి టార్గెట్ గా స్రవంతి విమర్శలు గుప్పించే అవకాశం ఉందని తెలుస్తోంది.

#palvai-sravanthi-reddy #telangana-elections-2023
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe