ఐశ్యర్యారాయ్ పై క్రికెట్ ప్లేయర్ హాట్ కామెంట్స్..ఫైర్ అయిన షోయబ్ అక్తర్..!
ఐశ్వర్యారాయ్ ను పెళ్లి చేసుకుంటే పవిత్రమైన పిల్లలు పుడతారా అంటూ దారుణమైన వ్యాఖ్యలు చేశారు పాక్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్. ఓ కార్యక్రమంలో ఆయన చేసిన కామెంట్స్ తీవ్ర విమర్శలకు దారితీసింది. పాకిస్థాన్ మాజీ స్పీడ్ స్టర్ షోయబ్ అక్తర్ సైతం ఆయన వ్యాఖ్యలను ఖండించారు.
Aishwarya Rai: బాలీవుడ్ స్టార్ హీరోయిన్, విశ్వసుందరి ఐశ్వర్య రాయ్ పై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. అబ్దుల్ రజాక్ నటి ఐశ్వర్య రాయ్ పై నోరు పారేసుకున్నాడు. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఐశ్వర్యా రాయ్ ని పెళ్లి చేసుకున్నంత మాత్రాన అందమైన, పవిత్రమైన పిల్లలు పుడతారా? అంటూ వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు.
ఐశ్వర్య రాయ్ క్యారెక్టర్‌ని బ్యాడ్ చేస్తూ మాట్లాడడంపై భారతీయులు మండి పడుతున్నారు. తరాలు మారుతున్నా పాకిస్తాన్ క్రికెటర్లు బుద్ధి మార్చుకోవడం లేదని పోస్టులు చేస్తున్నారు. ఆఖరికి పాకిస్తాన్ క్రికెట్ టీమ్ అట్టర్ ఫ్లాప్ అయినా ఓ భారతీయ నటిని అవమానించేలా మాట్లాడి, దృష్టి మార్చాలని చూడడం కంటే నీచమైన పని మరేదీ ఉండదని, అబ్దుల్ రజాక్ బేషరతుగా ఐశ్వర్య రాయ్‌కి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు ఆమె అభిమానులు. అంతే కాదు, అటు పాకిస్థాన్ లోనూ అబ్దుల్ రజాక్ వ్యాఖ్యలపై పాకిస్థాన్ మాజీ స్పీడ్ స్టర్ షోయబ్ అక్తర్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.
I highly condemn the inappropriate joke/comparison made by Razzaq.
No woman should be disrespected like this.
People seated beside him should have raised their voice right away rather than laughing & clapping.
రజాక్ వేసిన ఈ కుళ్లు జోకును తాను తీవ్రంగా ఖండిస్తున్నట్టు అక్తర్ తెలిపాడు. ఈ విధంగా పోల్చడం ద్వారా ఏ మహిళను అవమానించరాదని హితవు పలికాడు. రజాక్ ఈ వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు అతడి పక్కన కూర్చుని ఉన్నవాళ్లు వెంటనే అభ్యంతరం చెప్పి ఉండాల్సిందని అక్తర్ అభిప్రాయపడ్డాడు. కానీ వాళ్లు కూడా నవ్వుతూ, చప్పట్లు కొడుతూ అతడి కామెంట్లను ఎంజాయ్ చేశారని మండిపడ్డారు.
ఐశ్యర్యారాయ్ పై క్రికెట్ ప్లేయర్ హాట్ కామెంట్స్..ఫైర్ అయిన షోయబ్ అక్తర్..!
ఐశ్వర్యారాయ్ ను పెళ్లి చేసుకుంటే పవిత్రమైన పిల్లలు పుడతారా అంటూ దారుణమైన వ్యాఖ్యలు చేశారు పాక్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్. ఓ కార్యక్రమంలో ఆయన చేసిన కామెంట్స్ తీవ్ర విమర్శలకు దారితీసింది. పాకిస్థాన్ మాజీ స్పీడ్ స్టర్ షోయబ్ అక్తర్ సైతం ఆయన వ్యాఖ్యలను ఖండించారు.
Aishwarya Rai: బాలీవుడ్ స్టార్ హీరోయిన్, విశ్వసుందరి ఐశ్వర్య రాయ్ పై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. అబ్దుల్ రజాక్ నటి ఐశ్వర్య రాయ్ పై నోరు పారేసుకున్నాడు. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఐశ్వర్యా రాయ్ ని పెళ్లి చేసుకున్నంత మాత్రాన అందమైన, పవిత్రమైన పిల్లలు పుడతారా? అంటూ వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు.
ఐశ్వర్య రాయ్ క్యారెక్టర్‌ని బ్యాడ్ చేస్తూ మాట్లాడడంపై భారతీయులు మండి పడుతున్నారు. తరాలు మారుతున్నా పాకిస్తాన్ క్రికెటర్లు బుద్ధి మార్చుకోవడం లేదని పోస్టులు చేస్తున్నారు. ఆఖరికి పాకిస్తాన్ క్రికెట్ టీమ్ అట్టర్ ఫ్లాప్ అయినా ఓ భారతీయ నటిని అవమానించేలా మాట్లాడి, దృష్టి మార్చాలని చూడడం కంటే నీచమైన పని మరేదీ ఉండదని, అబ్దుల్ రజాక్ బేషరతుగా ఐశ్వర్య రాయ్‌కి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు ఆమె అభిమానులు. అంతే కాదు, అటు పాకిస్థాన్ లోనూ అబ్దుల్ రజాక్ వ్యాఖ్యలపై పాకిస్థాన్ మాజీ స్పీడ్ స్టర్ షోయబ్ అక్తర్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.
రజాక్ వేసిన ఈ కుళ్లు జోకును తాను తీవ్రంగా ఖండిస్తున్నట్టు అక్తర్ తెలిపాడు. ఈ విధంగా పోల్చడం ద్వారా ఏ మహిళను అవమానించరాదని హితవు పలికాడు. రజాక్ ఈ వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు అతడి పక్కన కూర్చుని ఉన్నవాళ్లు వెంటనే అభ్యంతరం చెప్పి ఉండాల్సిందని అక్తర్ అభిప్రాయపడ్డాడు. కానీ వాళ్లు కూడా నవ్వుతూ, చప్పట్లు కొడుతూ అతడి కామెంట్లను ఎంజాయ్ చేశారని మండిపడ్డారు.
Also Read: చుక్కకు చుక్కెదురు.. ఎన్నికల వేళ ఫంక్షన్లలో దావత్ బంద్..!